ఎమ్మెల్యే కేవీఆర్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు…..నేలపై కార్యకర్తలతో పాటు కూర్చుని మీటింగ్…

ఓ ఎమ్మెల్యే అంటే హంగులు ఆర్భాటాలు ఫ్లెక్సీలు కుర్చీలు అంటూ హడావుడి చేస్తారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే మీటింగ్ చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే..

నేలపై కార్యకర్తలతో పాటు కూర్చుని మీటింగ్..

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సన్నాహాక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ఆయా నియోజకవర్గాల్లో వరుసగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు..లోక్‌సభ ఎన్నికల్లో కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై వారి నుంచి అమూల్య అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఈ క్రమంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నెల రోజుల నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యకర్తలను అందరినీ కలుస్తూ.. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే, సమావేశాలను కటిక నేలపైనే నిర్వహిస్తున్నారు. సాదాసీదాగా ఓ మ్యాట్‌ను కింద వేసి ఆయన కూడా కార్యకర్తలతో కింద కూర్చొని మాట్లాడుతూ.. వారిలో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చేసిన నెటిజన్లు ఇలాంటి నాయకులే కదా.. ప్రజలకు కావాలంటూ కామెంట్ చేస్తున్నారు.