హోలీ పండుగ తర్వాత మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ప్రకటన.. సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంత వాడివేడి వాతావరణం మధ్య కొనసాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. మే 13 న జరగబోయే ఈ ఎన్నికలను ప్రతీ రాజకీయ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి…ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు పలువురి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, పూర్తి స్థాయి లిస్ట్ ని మాత్రం ఇది వరకు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ స్థానం కి గాను రఘువీర్ కుందూరు, జహీరాబాద్ స్థానం కి గాను సురేష్ కుమార్, అలాగే మహబూబ్ నగర్ స్థానం కి గాను చల్లా వంశీ చంద్ రెడ్డి,మహబూబాబాద్ ఎస్టీ స్థానం కి బలరాం నాయక్ పోరిక పేర్లను ప్రకటించారు. పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాని హోలీ పండగ లోపు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ స్థానం ని ఎట్టిపరిస్థితిలో అయినా గెలవాలని, ఈ స్థానం లో ఉన్న కార్యకర్తల వల్లే తానూ ముఖ్యమంత్రి ని అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్…