4 రోజుల పాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు..

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు..

*ఈనెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు…10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 12, 13న బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించుకున్న తర్వాత తొలిసారి కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొట్టమొదటి బడ్జెట్ ఇది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులే నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సభ కనీసం 12 రోజులు నిర్వహించాలని కోరింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. *ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, సభను నాలుగు రోజులు కాకుండా కనీసం 12 రోజులు నిర్వహించాలని* ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అవసరమైతే 13వ తేదీన మరోసారి బీఏసీ నిర్వహిస్తామని చెప్పారని కడియం శ్రీహరి వెల్లడించారు..