50 ఏళ్లుగా చుక్క నీరు కూడా తాగలేదు…కోకోకోలా తాగుతూ బతుకుతున్నాడు.!!

ఓ వ్యక్తి గత 50 ఏళ్లుగా చుక్క నీరు కూడా తాగలేదు. కేవలం కోకోకోలా తాగుతూ బతుకుతున్నాడు…ప్రస్తుతం 70వ పడిలో ఉన్న అతడు జీవిత చరమాంకంలో ఉన్నాడు. బ్రెజీల్‌కు చెందిన ఈ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. అతడి పరిస్థితి చూసి జనాలు షాకైపోతున్నారు..బ్రెజిల్‌లోని (Brazil) బాహియా ప్రాంతానికి చెందిన రాబర్ట్ పరేరాకు కోకోకోలా అంటే విపరీతమైన పిచ్చి. ఎంతగా అంటే అతడు మంచినీళ్లకు బదులు కోకోకోలానే తాగడం మొదలెట్టాడు. గత 50 ఏళ్లుగా అతడు ఇలాగే బతికేస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు కూడా అతడు కోకోకోలానే తాగుతాడు. ఈ పానీయంపై అతడికున్న ఇష్టత చివరకు వ్యసనంగా మారడంతో ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించింది..ప్రస్తుతం రాబర్ట్ గుండె జబ్బు, డయాబెటిస్ బారిన పడ్డాడు. ఒకసారి గుండె పోటు వచ్చింది. డాక్టర్లు ఆరు స్టెంట్లు కూడా వేశారు. ఆసుపత్రిలో ఉండగా కూడా అతడు ఆ పానీయాన్ని విడిచిపెట్టలేదు. మందులను మంచి నీళ్లకు బదులు కోకోకోలాతోనే వేసుకున్నాడు. ఇంత జరిగినా కూడా అతడిలో ఇప్పటికీ మార్పు రాలేదు. కోకోకోలా తప్ప మంచి నీళ్లు తాగేప్రసక్తే లేదని అతడు తేల్చి చెప్పాడు (Drinking coke for 50 years).తొలుత ఈ ఉదంతంపై అనేక సందేహాలు వ్యక్తమైనా రాబర్ట్ మనవడి వివరణతో ఇది నిజమేనని అందరూ నమ్మారు. తన తాత మంచి నీళ్లు తాగడం తాను ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చూడలేదని రాబర్ట్ మనవడు(27) చెప్పుకొచ్చాడు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది..