65 ఏళ్ల వయసులో ఒక్కటైన జంట… వారి ప్రేమ ప్రయాణంపై నెటిజన్లు ప్రశంసలు …

65 ఏళ్ల వయసులో ఒక్కటైన జంట…వారి ప్రేమ ప్రయాణంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు….
R9TELUGUNEWS.COM.
ప్రేమ ఎంత బ‌ల‌మైన‌దో చెప్ప‌డానికి వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన వివాహ‌మే నిర‌ద్శ‌నం. వారిద్ద‌రీ వ‌య‌స్సూ 65 ఏండ్లే. వారికి ఒకరంటే మ‌రొక‌రికి గాఢ‌మైన ప్రేమ‌.కొన్ని అనివార్య కార‌ణాల మూలంగా ఆమెకు యుక్త వ‌య‌సులో మ‌రొక‌రితో పెండ్లి జ‌రిగింది. అయినా ఆమె జ్ఞాపకాలతోనే అతడు ఒంటరిగానే గ‌డిపాడు. త‌న ప్రేయ‌సి దక్క‌లేద‌ని…ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు. కొంత కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు.
గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది. మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (ఇద్దరికీ 65 ఏళ్లే) శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ఇప్పుడీ లేటు వయసు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.