భూమికి పెద్ద కన్నం పడింది..!! చిలీ దేశంలో భారీ గొయ్యి వేగంగా విస్తరిస్తోంది…భయాన్ని సృష్టిస్తున్న భారీ గొయ్యి…

భూమికి పెద్ద కన్నం పడింది..!!!

చిలీ దేశంలో జులై 30న ఏర్పడ్డ భారీ గొయ్యి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకి పెరిగిపోయింది. ఇది ఎంత పెద్దదంటే.. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇందులో సులువుగా ఇమిడిపోతుంది. ఈ మిస్టరీ గొయ్యిపై ఆదేశానికి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగపు అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోనే అండర్ గ్రౌండ్ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దాంతో వెంటనే పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది…చిలీలోని టియెరా అమరిల్లా నగరానికి సమీపంలోని అల్కపెర్రోసాలో రాగి గనులు ఉన్నాయి. ఈ గనులకు సమీపంలోనే ఈ వింత గొయ్యి ఏర్పడింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజు రోజుకు ఆ గొయ్యి పెరుగుతున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. మొదట్లో 82 అడుగుల వెడల్పుతో 105 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. ఇప్పుడది 82 అడుగుల వెడల్పుతో 656 అడుగుల లోతుకు పెరిగింది..గొయ్యి క్రమంగా సైజు ఎందుకు పెరుగుతోందో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్థానికులు చాలా ఆందోళన చెందుతున్నారు. తాము మొదటి నుంచి గనుల తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్నా… అవి చేపట్టారనీ.. దాని వల్ల చెడు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని… స్థానిక కమ్యూనిటీ మేయర్ క్రిస్టోబాల్ జునిగా తెలిపారు. ఇలాంటి గొయ్యి ఏర్పడటం, సైజు పెరుగుతుండటం వంటివి ఇదివరకు ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు…