ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ తో ఆగం అవుతున్న జీవితాలు..!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జనాల జేబులు గుల్లచేస్తోంది. మధ్యవయస్కులే కాదు యువత సైతం ఈ ఆటకు బానిసై అందిన ప్రతిచోటా అప్పులు చేసి వాటిని తీర్చే దారిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. కళాశాలలకు కట్టాల్సిన రుసుములను సైతం ఆన్‌లైన్‌ జూదాల్లో పోగొడుతున్న విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్నవారు, ప్రభుత్వోద్యోగులు సైతం బాధితుల జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. సులువుగా సంపాదించాలన్న ఆశ, బాగా సంపాదించి జల్సాగా బతకాలన్న కోరికతో చాలామంది ఆన్‌లైన్‌ బెట్టింగుల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఈ యాప్స్‌ లేదా వెబ్‌సైట్లు కొత్తగా ఆడేవారిని మొదట్లో కొంత సొమ్ము గెలుచుకునేలా చేసి ఆకర్షిస్తుంటాయి. ఆ తరవాత వారు డబ్బులు పోగొట్టుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతుంటుందని నిపుణులు చెబుతున్నారు. రమ్మీ, పోకర్‌ వంటి ఆటలు ఆన్‌లైన్‌లో ఆడేటప్పుడు అవతల ఆడేది కంప్యూటర్‌ కావచ్చు, ఎంత బాగా ఆడామనుకున్నా చివరికి ఓడిపోయేలా ముందే ప్రోగ్రామ్‌ సిద్ధం చేసి ఉండే అవకాశాలూ కొట్టిపారేయలేం. ఒకదశ దాటాక చేతిలో డబ్బులు లేకపోతే బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పందేలు కాస్తున్నారు. ఆన్‌లైన్‌ జూదంలో డబ్బులు పోగొట్టుకున్నవారికి అప్పులివ్వడానికి అంతర్జాలం ద్వారానే రుణాలు ఇచ్చే యాప్స్‌ కూడా అందుబాటులోకి రావడం ఈ వ్యవహారంలో మరో కోణం. డబ్బులు పోగొట్టుకుని, అప్పులు తీర్చడం తలకు మించిన భారమవడంతో ఈ ఏడాది ఇప్పటికే పదుల సంఖ్యలో యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు..

స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ పేకాట, బెట్టింగ్‌ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది.

మొదట్లో వందలు పెడ్తే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు.. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్పు చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు చేస్తూ ఉన్న ఆస్తులు అమ్ముతూ… అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు…

కుటుంబాల్లో కలహాలు..

ఆన్‌లైన్‌ గేమ్స్తో యువకులు ఆర్థికంగా నష్టపోతుండడంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి
తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లాయి.

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామంలో అనేక మంది యువకులు ఆన్‌లైన్‌ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్‌లైన్‌ గేమ్స్జోలికి వెళ్లకుండా పోలీసులు గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.

ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేసేవారు. తన సన్నిహితులను అడిగి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడుతున్నారు… ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తీకి లక్షలలో అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు.. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న ఎకరం భూమిలో అర ఎకరం అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు..

వ్యవసాయం చేసేవారి సైతం కూడా ఆన్లైన్ గేమింగ్ వాడుతున్నారు.. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు పెరుగుతుంది.. చివరకు గేమ్స్‌ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యాడు. గేమ్స్‌లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తూ. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ.కోటి వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో రెండున్నర ఎకరాల భూమిని అమ్మి కట్టేయడం జరుగుతోంది.. అంతేకాకుండా మరికొందరు అప్పు చేసిన తర్వాత కూడా అది బయట తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్యలు చేసుకునే వారు ఇంకెందరు.. ఇలా రోజురోజుకీ ఆన్లైన్ బెట్టింగ్ పెరిగిపోతూ ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి…

దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకొని వెంటనే ఆన్లైన్ గేమ్ని క్లోజ్ చేసే ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఎంతో మందిని అమాయకులు బలవుతున్న ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకపోవడంతో పలువు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

సరైన చట్టాలు కరవు..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఇప్పుడు దేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌తోపాటు బెట్టింగ్‌ సైతం భారీగా పెరిగింది. నియంత్రణకు సరైన చట్టాలు లేకపోవడంతో ఈ జూదం జడలు విప్పుతోంది. ఆన్‌లైన్‌ క్రీడలకు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మధ్య ఉన్న తేడాను వీటిని నిర్వహించే కంపెనీలు చాలా తెలివిగా సొమ్ము చేసుకుంటున్నాయి. క్రీడా నైపుణ్యం అవసరం లేకుండా కాసే ఏ పందెమైనా జూదమే అని ‘పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌’ 1867లో స్పష్టంగా పేర్కొన్నారు. ‘ఒక ఆట లేదా పోటీలో గెలవడానికి ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలాంటి నైపుణ్యంతో పందెం గెలుచుకుంటే అది జూదం కాదు, అలా కాకపోతే మాత్రం అది జూదమే’ అని సుప్రీంకోర్టు సైతం చెప్పింది. కానీ దీన్ని కంపెనీలు తెలివిగా దాటవేస్తూ ఆన్‌లైన్‌ గేమ్‌ల ముసుగులో జనం మీదికి వల విసిరి వారిని పందేల్లోకి దింపుతున్నాయి.

దేశంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిరోధించడానికి సమగ్ర చట్టం లేదు. ఎప్పుడో 150 ఏళ్ల కింద తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌-1867’నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఆ తరవాత బెట్టింగ్‌లో ఎన్నోరకాల పెడధోరణులు మొదలయ్యాయి. గడచిన దశాబ్దకాలంగా వేగం పుంజుకున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను అడ్డుకోవడానికి ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవు. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జూదాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని చట్టంలో వెసులుబాటు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ లాంటి జూదం, బెట్టింగ్‌ యాప్‌లను నిషేధిస్తూ రెండు నెలల క్రితమే ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ -1974కు సవరణలు చేసింది. శిక్షలు, జరిమానాలు పెంచింది. దీని ప్రకారం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే ఆరునెలల జైలు, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా, రెండోసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను తమిళనాడు ఇటీవలే నిషేధించింది. కర్ణాటక కూడా ఇదే దిశగా యోచిస్తోంది..

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు.. పోలీస్ లు..

యువత బెట్టింగ్‌ యాప్స్, ఆన్‌లైన్‌ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్‌ యాప్‌లపై అవగాహన కల్పిస్తాం..