తెలంగాణలో వ్యవసాయ పురోగతి అభినందనీయం.. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం వచ్చింది.గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం
శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.
ప్రభుత్వ శాఖల స్టాల్స్ పరిశీలన
ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను గవర్నర్ సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.
150 కోట్లతో వ్యవసాయ కళాశాల శంకుస్థాపన
హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుం నగర్ వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు గవర్నర్ శంకుస్థాపన చేశారు. రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం
కోదాడ సమీపంలో 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని గవర్నర్ అన్నారు.
మట్టపల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో
కోటి రూపాయలతో యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ మరో కోటి రూపాయలతో డార్మెటరీ భవనాల నిర్మాణాలకు గవర్నర్ శంకుస్థాపన చేశారు.
రైతులకు యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్
ఈ సందర్భంగా రైతులకు రూ.2 కోట్ల 47 లక్షల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ అందజేశారు.అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు
బ్యాంకు లింకేజీ కింద రూ.504 కోట్లు
ఆదాయ వనరుల పెంపుదల కోసం రూ.89 కోట్లు
చెక్కుల రూపంలో అందజేశారు.వసంత పంచమి రోజున మట్టపల్లి దర్శనం సంతోషం వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరంలో ఉన్న మట్టపల్లి స్వయంభు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టమని గవర్నర్ అన్నారు. కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండటం, ఇలాంటి ఆలయం ఉండటం ఇక్కడి ప్రజల భాగ్యమన్నారు.
తెలంగాణలో వ్యవసాయ పురోగతి అభినందనీయం
జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు.
వ్యవసాయం ఒక విజ్ఞానమని” ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు,అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు .అంతేగాక కోదాడ సమీపంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేయడమే కాక, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ కు, మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మించే డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషమని అన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే నవోదయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. “వ్యవసాయం ఒక విజ్ఞానమని”, ఇంతకు పూర్వం దేశంలో జై జవాన్, జై కిసాన్, నినాదం ఉండేదని, ఆ తర్వాత జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం వచ్చిందని,ప్రస్తుతం ఇది జై జవాన్ ,జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ గా మారిందని తెలిపారు. గంగ ,యమునా, సరస్వతి లాగే
కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండడం, మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం
సాగు చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రైతులకు రెండు కోట్ల 47 లక్షల రూపాయల విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ ను అందజేశారు. అంతేకాక స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 504 కోట్లు, ఆదాయ వనరుల ను పెంపొందించేందుకు మరో 89 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు..
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం : మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. 85 శాతం ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.మట్టపల్లి అభివృద్ధికి ఇప్పటికే కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్నగర్ – మట్టపల్లి మధ్య రూ.80 కోట్లతో డబుల్ రోడ్డును మంజూరు చేశామని, గతంలో రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మించామని వివరించారు. కృష్ణ, గోదావరి జలాల హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు.
ఐటీ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుంది : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఐటీ, ఏఐ కన్నా వ్యవసాయ రంగమే కీలకంగా మారుతుందన్నారు. తెలంగాణ దేశానికే వరి అందించే రాష్ట్రంగా మారిందని చెప్పారు.రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు..
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 85% మందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మట్టపల్లి అభివృద్ధికి తన వంతు శాయ శక్తుల ఇదివరకే కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్నగర్ నుండి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేశామని, గతంలో 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించామని చెప్పారు. కృష్ణ ,గోదావరి జిల్లాలో ఒక చుక్క నీటిని కూడా వదులుకోమని, కృష్ణ,గోదావరి జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటైనకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హుజూర్నగర్, కోదాడ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా 150 కోట్ల రూపాయలతో వ్యవసాయ కళాశాల, 50 కోట్ల రూపాయలతో కోదాడ సమీపంలో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషమని అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఐటీ ,ఏఐ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుందని, సాఫ్ట్ వెర్, ఐటి సెక్టార్ ల నుండి వచ్చి వ్యవసాయ రంగంలో పనిచేసే రోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ దేశానికే వరి అందించే ఏకైక రాష్ట్రం గా మారిందని, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వ్యవసాయ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతులు దేశంలోనే ముందున్నారని, అలాగే ఇతర పంటల విషయంలో సైతం రాష్ట్ర రైతులు ముందు నిలుస్తున్నారని, ప్రత్యేకించి ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముందు ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పామాయిల్ పంటలో దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు పండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా సన్నబియ్యాన్ని సాగు చేయడంతో పాటు, పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమదేనన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి ,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడారు.
పలువురు ప్రజాప్రతినిధుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వందన సమర్పణ చేయగా, ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూర్ జయవీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా ఎస్పీ కె. నరసింహ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..