హనుమకొండలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో పోలీసుల భద్రత కొనసాగుతోంది…నిన్నటి ఘటనలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ జననచైతన్య సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.
హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియంతృత్వం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యేకు, ఆయనకు సహకరించే పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. రాయలసీమ సంస్కృతిని ఇక్కడికి తీసుకురావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ అలాంటి సంస్కృతికి తావులేదన్నారు. కాంగ్రెస్ దాడులను తిప్పికొడతామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు…
సవాళ్లు, ప్రతిసవాళ్లతో హనుమకొండ రణరంగా మారింది. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ శ్రేణులు చౌరస్తాకు చేరితే.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాల్లోకి వెళితే..హనుమకొండ నగరంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జనచైతన్య సభ నిర్వహించారు..