లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

*శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం*

శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం
ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కెమెరాలు దర్శనమిచ్చాయి. శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద డ్రోన్ కెమెరాలు ఆకాశంలో ఎగురుతుండగా భక్తులు గమనించడంతో డ్రోన్ ఆపరేటర్లు హుటాహుటీన డ్రోన్ కెమెరాను కిందికి దించారు. సమాచారం అందుకున్న దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పుష్కరిణి వద్దకు చేరుకుని డ్రోన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

*ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ*

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆతదుపరి రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని వెల్లడించారు. మరోపక్క ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు.

దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రాబోయే నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

*నవంబర్ 11, సోమవారం :*

• కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

*నవంబర్ 12, మంగళవారం :*

• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

*నవంబర్ 13 బుధవారం :*

• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

*నవంబర్ 14 గురువారం :*

• తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మూడో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తోంది..

*జబల్పుర్‌: రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌-హమాస్‌ల యుద్ధాలతో మూడో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తోందని అనిపిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు.*

యుద్ధం వస్తోందన్న భావన మనలో కలుగుతోందని, అది ఉక్రెయిన్‌లోగానీ, గాజాలోగానీ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని తెలిపారు.

ఆదివారం ఆయన జబల్పుర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సైన్సు ఎంతగానో అభివృద్ధి చెందినా, దాని ఫలాలు పేదలకు చేరడం లేదని అభిప్రాయపడ్డారు. కానీ సైన్సు అభివృద్ధి చేసిన ఆయుధాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఔషధాలు గ్రామాలకు చేరడం లేదని, కానీ తుపాకులు చేరుతున్నాయని పేర్కొన్నారు.

సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులు

రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఆరోజు సర్వే వద్దని ఇప్పుడు ఏం మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే

నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు, వాహనాలు, తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీత.

సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డు.

సౌతాఫ్రికాతో రెండో టీ20లో డకౌట్ అయిన సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సార్లు(4) సున్నాకే వెనుదిరిగిన భారత ప్లేయర్‌గా నిలిచారు. రోహిత్ శర్మ 2018లో, విరాట్ కోహ్లీ 2024లో మూడుసార్ల చొప్పున డకౌటయ్యారు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సార్లు(12) సున్నాకే ఔటైన అవాంఛిత రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది…

*ఈ నెల 18న‌ టీటీడీ నూతన పాలకమండలి సమావేశం*

ఇటీవల టీటీడీ పాలక మండలిని నియమించిన కూటమి ప్రభుత్వం

25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో బోర్డు ఏర్పాటు

చైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం

తొలిసారిగా సమావేశం అవుతున్న టీటీడీ నూతన పాలకమండలి

ఏపీ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కూడిన టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేశారు. టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు (బొల్లినేని రాజగోపాల్ నాయుడు) చైర్మన్ గా నియమితులయ్యారు.

ఈ నేపథ్యంలో, టీటీడీ నూతన పాలకమండలి నవంబరు18న తొలిసారిగా సమావేశంగా కానుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉదయం 10.15 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

జార్ఖండ్ అసెంబ్లీ హోరాహోరీ…

జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీయే కూటమి హోరాహోరీ తలపడుతోంది…చిన్న రాష్ట్రం కావడం, కుల సమీకరణాలు కూడా ఎక్కువగానే ఉండటంతో ఇక్కడ ప్రతీ అసెంబ్లీ సీటు గెల్చుకోవడం ప్రధాన పక్షాలకు చాలా కీలకంగా మారింది. దీంతో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఇక్కడ చెమటోడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో దాదాపుగా ఇక్కడ హోరాహోరీ తప్పదని తేలిపోతోంది. అదే సమయంలో ఎవరికి ఎడ్జ్ ఉందన్న దానిపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెలువరిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ లోక్ పోల్ కూడా తాము జార్ఖండ్ లో తాజాగా చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది.
ఇందులో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ సీట్లలో అత్యధిక సీట్లను ఇండియా కూటమే కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు లోక్ పోల్ తేల్చింది. ఇండియా కూటమికి 41 నుంచి 44 సీట్లు వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే రిపోర్ట్ లో వెల్లడించింది. అలాగే ఎన్డీయే కూటమికి 36 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 42 సీట్లు అవసరం..

అలాగే ఇండియా కూటమికి 39 నుంచి 41 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ అంచనా వేసింది. అటు ఎన్డీయే కూటమికి 38 నుంచి 40 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇతరులకు 18 నుంచి 20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 500 శాంపిల్స్ చొప్పున మొత్తం 40500 శాంపిల్స్ సేకరించి ఈ సర్వే చేసినట్లు తాజాగా లోక్ పోల్ ట్వీట్ చేసింది…

నితీశ్‌ ‘సిగ్గులేని వ్యక్తి’..ప్రశాంత్ కిశోర్.

జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను నిశితంగా విమర్శించారు…నితీశ్‌ను ‘సిగ్గులేని వ్యక్తి’గా అభివర్ణించిన ప్రశాంత్ కిశోర్ ఆయన బిజెపితో చేతులు కలపడం ద్వారా ముస్లింలను ‘వెన్నుపోటు పొడిచారు’ అని ఆరోపించారు. నితీశ్‌కు ఒకప్పుడు సన్నిహిత సహచరునిగా ఉన్న మాజీ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో మైనారిటీ వర్గాన్ని ఆకట్టుకోవడానికి జెడి (యు) అధినేత చేస్తున్న యత్నాలపై ప్రశ్నలకు స్పందించారు. ‘అవును, నితీశ్ నిజంగానే ముస్లింలను వెన్నులో పొడవడం ద్వారా వారికి ఎంతో చేశారు.

ముస్లింల అఖండ మద్దతుతో 2015లో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, రెందు సంవత్సరాల తరువాత బిజెపితో తిరిగి చేతులు కలిపారు’ అని కిశోర్ అన్నారు. సిఎఎపై నితీశ్‌తో బాహాటంగా వాదనకు దిగిన కారణంగా పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన జెడి (యు) మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు బీహార్ సిఎంపై ఆరోపణలు కొనసాగించారు. ‘ముస్లింల పౌరసత్వాన్ని పరిహరించబోయిన శాసనాన్ని నితీశ్ సమర్థించారు’ అని కిశోర్ ఆరోపించారు. ‘నితీశ్ కుమార్ సిగ్గు లేని మనిషి, ఆయన తీరుకు బీహార్ ప్రజలు విసుగు చెంది, ఆయనను అధికారం నుంచి దించివేయాలని కోరుకుంటున్నారు’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.