జడ్చర్ల మునిసిపల్ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యింది. బీఆర్ఎస్ పార్టీనే మరోసారి పీఠాన్ని దక్కించుకుంది. కోనేటి పుష్పలతను చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ చైర్పర్సన్ దోరేపల్లిలక్ష్మీపై జూలై 25న పాలకవర్గం సభ్యులు అవిశ్వాసం పెట్టి, పదవీలో నుంచి దించేశారు..మూడు నెలలు గడిచాక చైర్పర్సన్ ఎన్నికను ఎన్నికల అధికారి మహబూబ్నగర్ ఆర్డీవో నవీన్, జడ్చర్ల మునిసిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మెజారిటీ బలం ఉన్న బీఆర్ఎస్ మళ్లీ పీఠా న్ని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత ఉమ్మడి జిల్లాలో అధిక మునిసిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మరికొందరు చైర్పర్సన్లు ఆ పార్టీలో చేరారు. కాగా అందుకు భిన్నంగా జడ్చర్ల మునిసిపాలిటీని తమ ఖాతాలో వేసుకునే అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం..
రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. క్యాంపులో ఉన్న వారితో లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు. కోనేటి పుష్పలతకు చైర్పర్సన్ అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించారు. 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలతను చైర్పర్సన్ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్ శశికిరణ్ ప్రతిపాదించారు. 17వ వార్డు కౌన్సిలర్ చైతన్యగౌడ్ మద్దతు పలికారు. చైర్పర్సన్ అభ్యర్థిత్వానికి మరొకరు పోటీలో లేకపోవడంతో నిర్ణీత సమయం అనంతరం పుష్పలత ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో చైర్పర్సన్ స్థానాన్ని బీఆర్ఎస్ తిరిగి చేజిక్కించుకుంది..