ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీవర్షాలు.. ఈ జిల్లాలలో ఆకస్మిక వరదలకు ఛాన్స్..!

ప్రవాహంలో చిక్కుకుపోయిన బస్సు.

ఏపీలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం.

నెల్లూరు జిల్లాలో 20 అడుగులు ముందుకు సముద్రం..!

వర్షాలు కురిసే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటిన సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక మళ్ళీ తీవ్ర వాయుగుండంగా ఇది బలహీన పడనుంది.ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

*తుపాను ప్రభావంతో భారీవర్షాలు*

నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గడిచిన ఆరు గంటలలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదలికలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం మధ్యాహ్నం ప్రత్యేక బుల్లెట్ ను విడుదల చేశారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఫేంగాల్ తుఫాన్. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్లు, దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరికొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. తిరుపతి నెల్లూరు ప్రకాశం తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలలో ఫ్లాష్ ఫ్లాటుకు అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రుణంకి కుర్మ నాథ్ మేనేజింగ్ డైరెక్టర్ విపత్తుల నిర్వహణ వారు ఉత్తర్వులను వెల్లడించారు..

ఏపీలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం
వర్షాలు కురిసే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటిన సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక మళ్ళీ తీవ్ర వాయుగుండంగా ఇది బలహీన పడనుంది.ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి..

ఈ జిల్లాలలో ఆకస్మిక వరదలకు ఛాన్స్..
అంతే కాదు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, వైయస్సార్ జిల్లా, చిత్తూరు జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. సముద్రతీర ప్రాంతాలలో ఉన్న మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు ఆరవ నెంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు మూడవ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు….

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి మహాబలిపురం, కారైక్కాల్‌ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో గాలులు వీచినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విశాఖ, తిరుపతిత్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తడ మండలం భీములివారిపాలెంలో 131.5 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరులో 128.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే పుత్తూరు మండలం కేఎం అగ్రహారంలో 116, దొరవారిసత్రంలోని పూలతోటలో 114, తడలో 108, చిత్తమూరు మండలం మల్లంలో 103, నగరిలో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మల్లంలో 111.5, అల్లంపాడులో 103.5, విద్యానగర్‌లో 98.5 మి.మీ. వర్షం కురిసింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది.

ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురవడంతో కాలువలు, రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికితోడు చలితీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఆది, సోమవారాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది..

ప్రవాహంలో చిక్కుకుపోయిన బస్సు..

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్థనపురం సమీపంలో నేరేడు కాలువ పొంగి ప్రవహిస్తోంది. 40మంది ప్రయాణికులతో వచ్చిన ఆర్టీసీ బస్సు కాజ్‌వేపై నీటి ఉధృతిలో చిక్కుకుని ఆగిపోయింది. బస్సులో ఉన్నవారిని గ్రామస్థులు క్షేమంగా గట్టుకు చేర్చారు.