శనేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం..విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం.!

స్థానిక మోతుకపల్లి సమీపంలో శనేశ్వర స్వామి ఆలయం ఆర్చ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వామి వారి రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు…ఈ నెల 6, 7 తేదీల్లో ఈ ఆలయానికి సమీపంలోనే ఇస్తేమా జరిగింది. అయితే విగ్రహాన్ని ఎదరు ధ్వంసం చేశారు అనే అంశంపై స్పష్టత లేదు. ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, విగ్రహం ధ్వంసంపై విశ్వ హిందూపరిషత్‌, హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు శనీశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.