బర్రె కోసం సీసీ కెమెరా వెతుకుతుంటే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది..

మతిస్థిమితం లేని మహిళలను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు…..అలాంటి దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా(medak) మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది..ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేని ఓ మహిళ.. రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి.. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న ఆమె కనిపించేసరికి.. తీసుకెళ్లి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల, ఒకరి తరవాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ఈ దారుణానికి పాల్పడిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్న విషయం నిందితులు గుర్తించలేదు.

కాగా గ్రామంలో 10వ తేదీన స్వామి అనే వ్యక్తి బర్రె తప్పిపోగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బర్రె మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు పోలీసులు.
ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీస్ లు. మరోవైపు మతిస్థిమితం లేని మహిళను మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు…