మేయర్తో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్కు గుడ్ బై..l
మేయర్తో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్కు గుడ్ బై..
మాజీ సీఎం కేసీఆర్కు మరో బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్కు సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు..ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో శనివారం (జనవరి 25) బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కరీంగనర్ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు…స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 12:00 జాయినింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కాగా, సునీల్ రావు కరీంనగర్ బీఆర్ఎస్లో కీలక నేత. ప్రస్తుతం కరీంనగర్ మేయర్గా ఉన్న ఆయన కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. మరికొన్ని రోజుల్లో కరీంగనర్, నిజామాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో సునీల్ రావు పార్టీని వీడటం గులాబీ పార్టీకి ఎదురు దెబ్బేనని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు…
కరీంనగర్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 33 స్థానాలు, బీజీపే 13 స్థానాలు, ఎంఐఎం 8, ఇండిపెండెంట్ 6, కాంగ్రెస్ 0 గెలుచుకున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్లో 24 మంది కార్పొరేటర్లు ఉండగా.. బీజేపీలో 16 మంది, కాంగ్రెస్ 12 మంది, ఎంఐఎంలో 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు..