ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం…మెరుపులు మెరిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ…!.
తిలక్ వర్మ అద్భుత అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా.. భారత జట్టు రెండవ T20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది..తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తిలక్ 55 బంతుల్లో నాలుగు ఫోర్లు ,ఐదు సిక్సర్ల సహాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీని సహాయంతో భారత్ 19.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 166 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. తిలక్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులు చేయగా, తొమ్మిదో బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన రవి బిష్ణోయ్ ఐదు బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ తరఫున బ్రైడెన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టి జట్టును విజయపథంలో నడిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ తిలక్ ఇన్నింగ్స్ ముందు అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ ఎంతో రసవత్తరంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తన ప్లేయింగ్ 11లో రెండు ప్రధాన మార్పులు చేశాడు. ఇందులో నితీష్ రెడ్డి మ, రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ , ధృవ్ జురెల్‌లు చేరారు. అదే సమయంలో.. ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు కనిపించాయి…