పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి డబ్బులు జమ చేసిన బ్యాంకు సిబ్బంది..

ఆదిలాబాద్ – సిరికొండ మండలం లచ్చింపూర్(బి)కు చెందిన పెందూర్ సోంబాయికి ఆరుగురు కూతుర్లు.. అందులో రెండో కుమార్తె హీరాదేవికి గతేడాది వేసవిలో వివాహం చేసింది..

కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా వచ్చిన చెక్కును బ్యాంకులో వేయగా అప్పుకు వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్న సిబ్బంది..

విషయం తెలుసుకున్న మహిళ బ్యాంకుకు వెళ్లి డబ్బులు అడగడంతో పంట అప్పు కోసం తీసుకున్న వడ్డీ కింద రూ.60 వేలు పట్టుకొని మిగతా రూ.40 వేలు ఆమె చేతిలో పెట్టారు..

దీంతో కంటతడి పెట్టుకొని బ్యాంక్ నుండి వెళ్లిపోయిన సోంబాయి.