నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు..
175 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 92,250 మంది అభ్యర్థులు
ఉ.10 గంటల నుంచి మ.12.30 వరకు పేపర్-1
మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2
అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన APPSC..
తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ….…….
హైదరాబాద్ అదనపు సీపీగా పి. విశ్వప్రసాద్……….
సీఐడీ ఎస్పీలుగా నవీన్‌కుమార్, బి. రామ్‌రెడ్డి..
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయెల్ డెవిస్…………
హైదరాబాద్ ట్రాఫిక్ సీపీగా గుజరావు భూపాల్……….
గవర్నర్ ఏడీసీగా సిరిశెట్టి సంకీర్త్,……….
ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్….
హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా ఎస్. చైతన్య………..
.
*తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలు*
*అనుకున్నదే జరిగింది.. తెలంగాణలోనూ మొదలైంది*
తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్‌ఫ్లూ మొదటి పాజిటివ్ కేసు నమోదైందని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు శనివారం నాడు ధృవీకరించారు.
దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పౌల్ట్రీ నుండి ఒక కిలోమీటరు పరిధిలో ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని డిపార్ట్మెంట్ అధికారులు పరిమితం చేశారు. కల్లింగ్ ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభించారు. గ్రామం, దాని చుట్టుపక్కల ప్రభావిత ప్రాంగణానికి ఒక కిలోమీటరు పరిధిలోని ఇతర పౌల్ట్రీలతో పాటు వ్యవసాయ క్షేత్రంలో బయో-సేఫ్టీ చర్యలు కూడా ప్రారంభించారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు నేలపట్లలోని పౌల్ట్రీ ఫారాల్లో వచ్చే 15 రోజుల పాటు ఆంక్షలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కోళ్ల ఆకస్మిక మృతిపై సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యుల బృందం పాశం శివ అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫారమ్‌ను పరిశీలించి నమూనాలను సేకరించింది. వైద్యులు నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు…
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు.. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుపై విజయంతో భారత్ ప్లేయర్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇవాళ్టి మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువ. దీంతో టోర్నీలో నిలబడాలంటే పాకిస్థాన్ జట్టుకు గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ స్టార్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ జట్టే ఫేవరెట్. అదే సమయంలో ఇది పాకిస్థాన్ కు డూఆర్ డై మ్యాచ్. ఒక విధంగా ఇది ఫైనల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. భారత్ పై పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన ప్రతిసారి పాకిస్థాన్ లో ఫ్యాన్స్ ఆందోళనలకు దిగడం సర్వసాధారణమే. టీవీలనుసైతం పగలగొడుతూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతుంటారు. అయితే, ఈసారి మాత్రం ఆ అవకాశం లేదని బాసిత్ అలీ చెప్పారు. ఎందుకంటే.. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రజలు చిన్నదానికి కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి పాకిస్థాన్ జట్టు ఓడిపోయినా టీవీ సెట్లు పగిలిపోయిన శబ్దం వినిపించదని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు..ఇవాళ్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ జట్టే ఫేవరేట్. ఇందులో ఎలాంటి సందేహం లేదని బాసిత్ అలీ అన్నారు. పాకిస్థాన్ టీం నుంచి మూడో స్థానంలో క్రీజులోకి ఎవరు వస్తారో ఎవరీకీ తెలియదు. ఉస్మాన్ ఖాన్ ను ఇమామ్ తో కలిసి ఓపెనింగ్ చేయమని, బాబర్ అజామ్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావొచ్చు. ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోపీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య గత ఐదు మ్యాచ్ లలో విజయాల్లో భారత్ జట్టు ముందంజలో ఉంది. తాజా మ్యాచ్ కూడా భారత్ ఖాతాలోకి చేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. భారత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్, రోహిత్ ఫామ్ లో లేకపోతే పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ సమతూకంగా ఉంటుందని బసిత్ చెప్పుకొచ్చాడు..
‘సారీ అమ్మా.. ఈరోజు చనిపోతున్నా’.. అని నోట్‌బుక్‌లో రాసుకుని
తెలంగాణ : ఇటీవల కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. తాజాగా హైదరాబద్ ఉప్పల్‌లోని ఓ స్కూల్లో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. క్లాస్ రూమ్ లోని CCTV డైరెక్షన్‌ను మార్చడంతో 8వ తరగతి బాలుడు సంగారెడ్డి(13)ని పీఈటీ మందలించి కొట్టాడు. క్లాస్ టీచర్ కూడా తిట్టింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు నోట్ బుక్‌లో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసి పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు.
SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీఫోన్…
SLBC సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా…
దాదాపు 20 నిమిషాల పాటు ఘటనకు సంబంధించి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సిఎం…
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలం నుండి NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్లతో పాటు అవసరమైన సహాయక చర్యలను, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తీరును రాహుల్ గాంధీకి వివరించిన సిఎం…
గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సిఎం…
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు ,ఆ కుటుంబాలను ఆదుకోవాలని సూచించిన రాహుల్…
ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ…
SLBC Update:
SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం
టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన NDRF బృందం..
మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయిన NDRF బృందం..
ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండిపోయిందని చెబుతున్న అధికారులు..
ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న అధికారులు..
సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని చెబుతున్న NDRF.
ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం..