ఏపూర్,గుండ్రంపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో బ్రాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ..చుట్టు పక్కల ప్రాంతంలో రెడ్ జోన్ ప్రకటించిన అధికారులు..!
*నల్లగొండ జిల్లా :-*
ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది.
_• చిట్యాల మండలం, *ఏపూర్,గుండ్రంపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో బ్రాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ.*_
*• సుమారు 2 లక్షల కోళ్లను చంపుతున్న వెటర్నరీ డాక్టర్లు..*
_• చుట్టు పక్కల ప్రాంతంలో రెడ్ జోన్ ప్రకటించిన అధికారులు…
బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది. వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది. అటు కోళ్లఫారాలను కట్టడి చేస్తూ.. ఇటు ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది..