వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించిన అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు..మహిళల హక్కులను బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగు..!.

All India Muslim Women Personal Law Board Backs Waqf Amendment …

…కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి వక్ఫ్ సవరన బిల్లు (Waqf Amendment Bill) సుదీర్ఘ చర్చల అనంతరం లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే..ఈ బిల్లుకు శనివారం సాయంత్రం భారత రాష్ట్రపతి ముర్ము ఆమోదం (Presidential approval) తెలిపారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు ఇకపై యాక్ట్ గా మారిపోయింది. ఈ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డులలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం మరియు ఆస్తుల నిర్వహణలో సంస్కరణలు తీసుకు రావడం వంటి అంశాలను కలిగి ఉంది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరూ ఉహించిన విధంగా.. అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు (All India Muslim Women Personal Law Board) వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 కు మద్దతు ప్రకటించింది.

ఈ బోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్ ఈ చట్టాన్ని సానుకూలంగా స్వాగతించారు. ఈ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డు లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం, ఆస్తుల నిర్వహణలో సంస్కరణలు తీసుకు రావడం వంటి అంశాలను కలిగి ఉందని, ఇవి ముస్లిం మహిళల సాధికారతకు దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ బిల్లు విషయంలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) వంటి ఇతర సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం ముస్లిం సమాజ ఆస్తులపై ప్రభుత్వ జోక్యాన్ని పెంచుతుందని వాదిస్తున్నారు. కానీ మహిళా బోర్డు దృష్టిలో, ఈ సవరణలు వక్ఫ్ వ్యవస్థలో మహిళల హక్కులను బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగు గా భావిస్తున్నారు….