ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేసిన నిఘా వర్గాలు.

ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేసిన నిఘా వర్గాలు.

జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమైనాయి. అందులోభాగంగా నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం విడుదల చేశాయి. మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫొటోను సైతం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.అలాగే రావల్ కోట్‌లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. తొలుత నిఘా వర్గాలు ఊహా చిత్రాలను విడుదల చేశాయి. ఆ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు..