విమానంలో ఐదుగురు వెల్ ట్రైన్డ్ ఎల్ఈటీ టెర్రరిస్టులు ఉన్నారని.. ఇందులో ఎటువంటి అనుమానం లేదని మెయిల్లో పేర్కొన్నారు.
దీంతో చెన్నై విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మెయిల్ వచ్చే సమయానికి విమానం చెన్నై నుంచి టేకాఫ్ అయ్యి శ్రీలంకకు వెళ్లడంతో ఈ విషయాన్ని అక్కడి అధికారులకు సమాచారం అందించారు చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు. విమానంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారని.. విమానాన్ని వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు. చెన్నై అధికారుల సూచన మేరకు.. శ్రీలంక పోలీసులు కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేరని అక్కడి అధికారులు నిర్ధారించారు.
దీంతో ఇది నకిలీ మెయిల్ అని గుర్తించిన చెన్నై ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విమానంలో టెర్రరిస్టులు ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత, పాక్ మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు భారత్ నుంచి శ్రీలంక వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది..
సరిహద్దుల్లో యుద్ద వాతావరణం
ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతారణ పరిస్థితులు నెలకొన్నాయి. భూమితో పాటు నీటిపై కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇండియానుంచి ముప్పు తప్పదన్న నిర్ణయానికి వచ్చేసింది. సరిహద్దుల దగ్గర ఉన్న ప్రజల్ని ఇందుకోసం సిద్ధం చేస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదుల్ని..ఉగ్రవాదులకు సాయం చేస్తున్న పాకిస్తాన్ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు…