పాకిస్తాన్ సైనిక శక్తిని పెంచే దేశాలు మూడు ఉన్నాయి. దానికి ఆయుధాలు సరఫరా చేసే వారిలో చైనా, టర్కీ కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచే పేరున్న మరొక దేశం ఉంది. ఆ దేశం మరేదో కాదు.. నెదర్లాండ్స్. ఇది చైనా తర్వాత పాకిస్తాన్‌కు రెండవ అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు. అయితే, దీని కారణంగా నెదర్లాండ్స్ కూడా టర్కీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చంటున్నారు… పాక్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆ దేశం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ దేశం యూరప్‌లో ఉన్న నెదర్లాండ్స్. చైనా (China) తర్వాత పాకిస్తాన్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నెదర్లాండ్స్ (Netherlands) ఉంది.
పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్న నెదర్లాండ్స్‌కు కూడా టర్కీకి ఎదురైన అనుభవమే ఎదురుకావచ్చు. అలా జరిగితే నెదర్లాండ్స్‌కు పెద్ద ఇబ్బంది ఎదురుకావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆరు రోజుల ఈ పర్యటనలో భాగంగా జై శంకర్ డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. మే 19వ తేదీన నెదర్లాండ్స్‌కు జైశంకర్ నేరుగా చేరుకున్నారు..ఆపరేషన్ సిందూర్ తర్వాత జై శంకర్ తొలి విదేశీ పర్యటన ఇదే. అది కూడా పాకిస్థాన్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరా దేశమైన నెదర్లాండ్స్‌కు జైశంకర్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధాని, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రిని జైశంకర్ కలిశారు. అనంతరం సోషల్ మీడియాలో ఆ సమావేశం గురించి ట్వీట్ చేశారు. నెదర్లాండ్స్ ప్రధానికి మన ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసినట్టు చెప్పారు.
భారతదేశం, నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని నెదర్లాండ్స్ ప్రధాని అభిలషించారని, . ఈ లక్ష్యాలను సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయని నమ్మకం ఉందని జైశంకర్ అన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేసినట్టు తెలిపారు. కాగా, పెహల్గాంలోని జరిగిన ఉగ్రదాడిని నెదర్లాండ్స్ ఖండించింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించి రెండు దేశాలు చర్చించుకోవాలని సూచించింది…
ఉగ్రవాదంపై కఠినమైన వైఖరికి నెదర్లాండ్స్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రిని కలిసిన తర్వాత, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ చేశారు. ‘‘హేగ్‌లో ప్రధానమంత్రి డిక్ స్కాఫ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేసాను’’ అని పేర్కొన్నారు.‘‘భారతదేశం-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాను. ఈ లక్ష్యాలను సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయని నమ్మకం ఉంది.’’ అని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.