కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.
••••••
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది.
నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది.
ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా.?
నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది!
జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నా…
లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు..!
నాజోలికి వస్తే బాగుండదు..
కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు
కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు!
నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు
పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు!
నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందే..!
*కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు..ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా..?*
నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా
పార్టీచేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా
కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు!
*బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు..పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను..!*
*కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ..! కాంగ్రెస్తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు!*
నాకు, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది
నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు
కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు
పొత్తులు ఉంటాయేమో కానీ… కేసీఆర్ బ్రతికి ఉన్నంత వరకు పార్టీ విలీనం ఉండదు..