న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య…!..తమ కూతురు ఆత్మహత్యకు ఆ వ్యక్తి కారణమంటున్న స్వేచ్చ తండ్రి…!
న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య
టీ న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య
సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు
జవహర్ నగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య.. బాడీని గాంధీ ఆసుపత్రికి తరలింపు
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్లోనివాసం ఉంటున్న యాంకర్ స్వేచ్చ….స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు…
ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
తమ కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమంటున్న స్వేచ్చ తండ్రి
భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉంటున్న స్వేచ్ఛ
స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయి : స్వేచ్ఛ తండ్రి
పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న అని నాతో జూన్ 26న చెప్పింది
స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చి ఆమెతో సహజీవనం చేశాడు
పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడు
ఈ విషయంలోనే నా కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది
నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలి
– స్వేచ్చ తండ్రి