నేటి పంచాంగం.. నేటి మాట…

ఓం శ్రీ గురుభ్యోనమః
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 07 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *దశమి* సా6.20 వరకు,
నక్షత్రం : *స్వాతి* రా8.05 వరకు,
యోగం : *సిద్ధం* రా9.35 వరకు,
కరణం : *గరజి* సా6.20 వరకు,

వర్జ్యం : *రా2.17 – 4.03*
దుర్ముహూర్తము : *ఉ5.32 – 7.17,*
అమృతకాలం : *ఉ10.20 – 12.06,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.33,
సూర్యాస్తమయం: 6.35,

*_నేటి మాట_*

*నిత్య జీవితంలో ఆధ్యాత్మిక యొక్క అవశ్యకత…!!*
మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.
ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం.
ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు.

అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి.
అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది… నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది.
ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.

ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి.
ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది.

నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..

మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏