*శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనిరు*
*ఏల్లుండి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తనున్న మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి*
*గంటగంటకు పెరుగుతున్న నీటి మట్టం*
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎగువ పరీవాహక ప్రాంతామైన జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుంది దీనితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతుంది శ్రీశైలం జలాశయం వరదనీటితో తొనికిసలాడుతుంది దీనితో ఎల్లుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనుననారు అందుకోసం డ్యామ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు
ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి,నారాయణ్ పూర్,జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారిగ వరదనీరు వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 1,71,208 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా సుంకేసుల నుంచి 61,931 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది దీనితో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 878.40 అడుగులకు చేరుకుంది
జలాశయం పూర్తి స్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులుగా ఉంది పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీలుగా నమోదైంది ఎగువన కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే శ్రీశైలం కుడి,ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుంది….