నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 10 – 07 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *పూర్ణిమ* రా1.47 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* పూర్తి,
యోగం : *ఐంద్రం* రా10.50 వరకు,
కరణం : *భద్ర* మ1.25 వరకు,
తదుపరి *బవ* రా1.47 వరకు,

వర్జ్యం : *ఉ3.19 – 5.01*
దుర్ముహూర్తము : *ఉ9.55 – 10.46,*
మరల *మ3.07 – 3.59*
అమృతకాలం : *రా1.30 – 3.12,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.35,
సూర్యాస్తమయం: 6.35,

*_నేటి విశేషం_*

*గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ*
*ఆషాఢ పూర్ణిమ/మహాషాఢీ*

*గురు కటాక్షం*
_శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారి ప్రవచనం…_
గురువు స్థానం మహోన్నతమైనది.
మనిషికే కాదు దైవానికి సైతం గురువే మార్గం చూపాలి, అందుకే దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరించమని పెద్దలు చెప్పారు.
గురువు అనే పదానికి చీకటిని పోగొట్టి వెలుగును ప్రసాదించేది అని అర్థం, గురువు ఓ జ్ఞాన దీపం.
అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి శిష్యుల జీవన గమనమంతటా జ్ఞానకాంతులను నింపుతూ ఉంటాడు.
భారతీయ సనాతన సంప్రదాయంలో తొలినాళ్ల నుంచి ఈ వెలుగు దివ్వెకు అంతటి విశేష స్థానం ఉంది. ఆషాఢ పూర్ణిమనాడు గురువులందరినీ పూజించుకుంటాం మనం.

గురు శిష్య సాంప్రదాయం జీవనది లాంటిది.
దైవమే గురువు రూపంలో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు, గురువు చెప్పింది అక్షరాలా పాటిస్తూ, తన తరువాతి తరాల వారికి గురుసందేశం అందించి శిష్యుడు ధన్యుడవుతాడు.
లోకమంతా గురువులే అయినప్పుడు తన అసలు గురువు ఎవరో వెతికి పట్టుకోవాల్సింది శిష్యుడే. ప్రత్యక్షంలోనూ పరోక్షంలోనూ తనను కాపాడి, ముందుకు నడిపించే గురువును చేరుకున్నవాడు ధన్యుడవుతాడు.
గురువే నా జీవితానికి శాసకుడు అంటాడు శ్రీరామచంద్రుడు.

గురువంటే సాక్షాత్తు పరమేశ్వరుని రూపం, సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రజాపతులను సృష్టించి లోకానికి ఇచ్చారు, మౌనవ్యాఖ్య చేత లోకాలను తరింప చేసే దక్షిణామూర్తి గురుస్వరూపమే.
శ్రీకృష్ణుడు జగద్గురువు, లోకానికి భగవద్గీత అందించాడు.
గురువులలో అగ్రగణ్యుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తుడు. శ్రీవిద్యకు, అద్వైత విద్యకు, యోగసిద్ధికి ఆలంబనమై గురు సంప్రదాయానికి పతాకస్థాయిలో నిలిచినవాడు దత్తగురువు.
దేశికులలో కెల్లా శ్రేష్ఠమైన దేశికురాలు అమ్మవారు ఆమె గురుమండల రూపిణి.
తన బిడ్డలకు ఈశ్వర తత్త్వాన్ని సుబోధకంగా తెలిపి, అందరినీ ఆయన వద్దకు చేర్చుతుంది.

*అనేక రకాల గురువులు…*
గురువులలో అనేకరకాల వారుంటారు.
మొదటి గురువును _ సూచక గురువు – అంటారు, అంటే ఉపాధ్యాయులు.
మనకు చదవడం, వ్రాయడం నేర్పించేది సూచక గురువే. జీవితానికి ఉపయోగపడే గ్రంథాలను పరిచయం చేస్తాడు. మనలో సంస్కారాన్ని పెంపొందించి పునాది వేసేవాడు ఆయనే.

*రెండో గురువును _వాచక గురువు – అంటారు*
ఆయన ఆశ్రమ ప్రాంగణంలో ఉంటారు.
ఆశ్రమ నియమాలను అనుసరిస్తూ ఉంటారు.
గురు ఆశ్రమం శాంతికి ఆలవాలమై ఉంటుంది.
వీరు ఎల్లప్పుడూ తపస్సు యందు మగ్నమై ఉంటారు, గురువు ఉండే ప్రదేశంలో తపస్సు, శ్రద్ధ రెండూ కేంద్రీకృతమై ఉంటాయి.
ఆశ్రమంలో ప్రవేశించిన వారిని తమ తపశ్శక్తితో అనుగ్రహిస్తూ ఉంటారు.
ఎక్కడ ఎలా మసలుకోవాలో వాచక గురువే మనకు నేర్పిస్తారు, మన ప్రవర్తనను తీర్చిదిద్దుతారు.
భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న అనురక్తిని మనలో పెంపొందిస్తారు, తన వాక్కుల చేత మనల్ని నియంత్రించి దైవంపై అభిముఖ్యం కలిగేలా చేస్తారు.

మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవారికి _ బోధక గురువు – అని పేరు.
గురువుకు గురువును… పరమ గురువు – అంటారు, వారికి కూడా గురువైన వారిని _ పరమేష్టి గురువు – అంటారు.
అంతకంటే పూర్వులను _పూర్వాచార్యులు – అని పిలుస్తారు.
పరమగురువు అన్నింటినీ త్యజించి, అన్ని మంత్రాలకూ ఆదిమంత్రమైన ప్రణవాన్ని జపిస్తారు, బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు.
వీరు కాకుండా _ నిషిద్ధ గురువులు – కూడా ఉంటారు, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉగ్రమైన ఆరాధనలు చేస్తారు, అలాంటివి చేసేవారు, నేర్పేవారి వద్దకు వెళ్లవద్దని ఆ విద్యలను నేర్చుకోవద్దని చెప్పేందుకే వాళ్లని నిషిద్ధ గురువులు అన్నారు.

*🙏🏻గురుదీక్షాక్రమం🙏🏻*

గురువు తన పాదాన్ని శిష్యుని తలమీద ఉంచుతాడు, దీన్ని – కుక్కుట దీక్ష-అంటారు, అనుష్ఠాన బలం కలిగిన గురువు తనయందు గురి ఉన్న శిష్యుని తలపై పాదాన్ని ఉంచుతాడు.
గురువు అనే మాటలోనే బరువు అని, లఘువు అనే మాటలోనే తేలిక అనే సంకేతాలు దాగున్నాయి, గుడ్డులో ఉన్న పిండం చాలా తేలికగా ఉంటుంది.
గుడ్డుకు ఏమాత్రం దెబ్బతగలకుండా కాళ్లు కదుపుతూ మెల్లగా వచ్చి రెక్కలు దగ్గరకు చేర్చి కడుపు మాత్రమే గుడ్డుకు తగిలేలా కోడి పొదగడానికి కూర్చుంటుంది.
శిష్యుణ్ణి ఆవరించిన మాయ అనే అజ్ఞానపు పెంకును తొలగించి పూర్ణత్వాన్ని ప్రసాదించేందుకు, భక్తి జ్ఞానాలనే రెక్కలను అందించేందుకు గురువులు ఈ రకమైన దీక్షనిస్తారు.

మరికొందరు గురువులు కేవలం చూపుచేత అనుగ్రహిస్తారు.
నదిలో చేప గుడ్లు పెట్టినప్పుడు అవి తేలుతూ వెళ్లిపోతుంటాయి.
వాటికి ముందో, వెనుకో ఉండి చేప తన గుడ్లను చూస్తూ ఉంటుంది , కొంతకాలానికి ఆ నీటిలోనే గుడ్లు పిల్లలవుతాయి.
అలాగే ఆత్మశక్తిని, ఆత్మానుభవాన్ని గురువు తన చూపులతో ప్రసాదిస్తాడు.

*మరో విశిష్టమైన దీక్షను స్మరణ దీక్ష – అంటారు*
గురువు పరమప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు.
శిష్యుణ్ణి గురించి స్మరించినంత మాత్రం చేత విద్యాప్రసారం జరుగుతుంది.
సముద్రపు ఒడ్డున ఇసుకలో పెట్టిన గుడ్లను వదలి తాబేలు ఎక్కడికో వెళుతుంది, మళ్లీ తన గుడ్లను చూసుకోవడానికి వేగంగా వెనక్కు రాలేదు.
ఆ గుడ్లు పిల్లలు కావాలని బలంగా కోరుకుంటుంది, తాబేటి స్మరణ బలం చేత ఆ గుడ్లు పిల్లలవుతాయి. .

గురువు శిష్యుణ్ణి తన స్మరణతోనే, స్ఫురణతోనే ప్రేరేపిస్తాడు.

_*🙏🏻గురుసన్నిధిలో….🙏🏻*_
గురువు కనబడగానే ఇంద్రియాలు అదుపులోకి రావాలి.
మనస్సు, బుద్ధి, కన్ను, చెవి ఇవన్నీ గురువు చెప్పే మాటలపైనే కేంద్రీకృతం కావాలి.
తన పరోక్షంలో శిష్యుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకుడు కాదు గురువు.

శ్రీరామచంద్రుడు, ‘గురువుగారూ! మీరు శాసకులు,
మీరు ఏది చెప్పారో అది చేయడమే నా జీవితానికి సార్ధక్యం’ అన్నాడు.
గురువు చెప్పింది చేసినవాడు ఈశ్వరుణ్ణి పొందుతాడు, ఆచార్యుడు తనను అనువర్తించే శిష్యుడికి లొంగిపోతాడు.
లోకంలో ఎవరైనా తమ ఆస్తిని కన్నబిడ్డలకు ఇవ్వాలని ప్రయత్నిస్తారు.
కానీ గురువొక్కడే తన ఆస్తి అయిన విజ్ఞానాన్ని శిష్యుల పరం చేసేస్తాడు.
యోగ్యుడైన కొడుకు ఉంటే శిష్యులలో ఒకడు అవుతాడు తప్ప గురువు ఆస్తి అంతటినీ ఒక్కడే అనుభవించలేడు.
గురుపదం త్యాగాన్ని చెబుతోంది కనుకే, అంతటి విశిష్టమైనది.
వినయశీలుడై గురువును సేవించిన వాడు ధన్యుడవుతాడు.
అటువంటి శిష్యునికోసం గురువు దైవాన్ని సైతం శాసిస్తాడు.

*🙏🏻వ్యాసపూర్ణిమ🙏🏻*

విష్ణువే స్వయంగా వేదవ్యాసుడయ్యాడు. వేదవ్యాసుడే లేకపోతే వేదసంస్కృతి అయోమయావస్థలో పడి ఉండేది.
కలియుగ మానవులకు ఈశ్వరతత్త్వం – అర్ధమయ్యేది కాదు.
ఆయన వేదాలను విభాగం చేసి ఉండకపోతే ఈనాడు మనకు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సామర్ధ్యం లోపించి ఉండేది.
పద్దెనిమిది పురాణాలను, భారత భాగవతాలను, ఉపనిషత్తుల సారాంశమై భగవంతుని తత్త్వాన్ని తెలియచెప్పే బ్రహ్మసూత్రాలను అందించాడు వేదవ్యాసుడు.

అటువంటి వేదవ్యాసుడు చింతాక్రాంతుడై ఉంటే నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చాడు.
వస్తూనే అద్భుతమైన మాటలతో ఆయనను సంబోధించాడు.
“వ్యాస మహర్షీ! నువ్వు బ్రహ్మతత్త్వ నిర్ణేతవు, భారతమనే కొత్త వేదాన్ని రచించావు.
కామాది అరిషడ్వర్గాలను జయించావు.
గొప్ప యోగాన్ని నేర్చుకున్నవాడివి.
ఏమిటి సామాన్యుడిలా బాధపడుతున్నావు? ఎందుకిలా చిన్నబుచ్చుకున్నావు?” అని అడిగాడు.
వ్యాసుని కలవరాన్ని తెలుసుకుని, “మనసులో వేదన తీరాలంటే భగవంతుని కథ చెప్పు.
ఎన్ని గ్రంథాలు రచించినప్పటికీ అవన్నీ విష్ణుభక్తిని కీర్తించకపోతే పిండాలు పెట్టే రేవులైపోతాయి.
విష్ణుభక్తి కలిగిన కావ్యం మానస సరోవరంలా పవిత్రమవుతుంది.
ఆ కథలు అర్ధం తెలిసి చెప్పినా, తెలియక చెప్పుకున్నా వాటిని స్మరిస్తే చాలు మానవులు ముక్తులవుతారు.
తపస్వులు, సాధువులు భక్తి కథా శ్రవణ మననాదులతో ధన్యులవుతారు” అన్నాడు. అలా భక్తి కావ్యమైన భాగవతాన్ని వ్యాసుడు అందించాడు.
వ్యాసుడు చెప్పనిది ఏదీ లేదు. ఎవరు ఎప్పుడు ఏది చెప్పినా వ్యాసుడు చెప్పినదే మళ్లీ చెప్పాలి కానీ, కొత్తగా చెప్పగలిగేది ఏదీ లేదు.
అటువంటి వ్యాసుణ్ణి పూజించుకోవడానికి ఏర్పడిందే వ్యాసపూర్ణిమ, ఎవ్వరూ ఏ పండుగలూ చేసుకోని ఆషాఢ మాసంలో పౌర్ణమినాడు గురువును పూజించే సంప్రదాయాన్ని ఏర్పరిచారు పెద్దలు.
గురుపూర్ణిమ నాడు తప్పనిసరిగా గురువులను వ్యాసునిగా భావించి పూజించాలి.

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందా యత పత్ర నేత్ర
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః

మహాభారతం అనే తైలముతో జ్ఞానదీపమును వెలిగించి విప్పారిన నేత్రములతో, విశాల హృదయంతో విరాజిల్లు, మనోహర రూప సౌందర్యంతో తనరారే మహాజ్ఞానియైన వ్యాస మునీంద్రులకు నమస్సులు,
వ్యాసమునీంద్రుల నిజ నామం అపాంతరత ముడు- ‘ఆ – ‘అజ్ఞానాన్ని తొలగించేవాడు, ఆత్మభావం కలవాడు’ అని ఆ పేరుకు అర్ధం.
తల్లి సత్యవతి, పరాశర మహర్షివల్ల యమునా నది ద్వీపంలో ఆమె కన్యాత్వానికి భంగం వాటిల్లకుండా యోజ నగంధిగా మార్చి మగబి డ్డను ప్రసాదించాడు.
ఆ శిశువే త్రికాల జ్ఞాన సంప న్నుడు, విశేషజ్ఞుడు అయిన వ్యాసదేవుడు.

సత్యవతి పూర్వనామం మత్స్యగంధి.
పూర్వజ న6లో చేది దేశ రాజైన ఉపరిచర వసువు కుమార్తె.
శాపవశం కారణంగా మత్స్యరూపంలో ఉన్న అద్రి అనే అప్సరస గర్భంలో జన్మించింది.
దాశరాజు (జాలరుల రాజు)కు ఆమె దొరికింది.
పెంచి పోషించి యవ్వనవతిని చేశాడు, సద్యోగ ర్భంలో వ్యాసుడు జన్మించాడు.
పుట్టుకతో నల్లగా ఉండడంచేత కృష్ణుడని, యమునా ద్వీపంలో జన్మించడం చేత ద్వైపాయనుడనీ, రెంటినీ కలిపి కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు.
వ్యాసుని తండ్రి, తాత, ముత్తాలందరూ అసా మాన్యులు.
ముత్తాత వశిష్ఠమహర్షి, బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతులలో ఒకడు, సప్తఋషు లలో ఒకడైన అతడు ఇక్ష్వాకుల కులగురువు.
అతని కుమారుడు శక్తి, వ్యాసునికి తాత, శక్తికు మారుడు వ్యాసుని తండ్రి పరాశరుడు, పలు సంహితలు రచించాడు.
వేదవ్యాసునిగా నామాం తరం చెందడానికి కారణం- గంపగుత్తగా వున్న వేదరాశిని విభజించి నాలుగు వేదాలుగా రూపొందించిన వ్యక్తి కావడం. అంతేకాక వేద ధర్మాలను సామాన్యులకు అర్ధమయ్యేలా చెప్ప డంకోసం ఆధ్యాత్మిక, లౌకిక విశేషాలను విశప రుస్తూ పంచమ వేదంగా ప్రఖ్యాతి పొందిన మహాభారతాన్ని, భక్తి మార్గానికి ప్రవచించే మహాభాగవతాన్ని, అష్టాదశ పురాణాలను ప్రస్థా నత్రయాన్ని రచించాడు.

వ్యాసుడు ఆర్జించిన జ్ఞాన సంపదను భార తీయ ఆధ్య్యాకత, అర్ష సంస్కృతులను పరిరక్షిం చేందుకు జీవితాన్ని ధారపోసాడు.
తాను గతిం చిన జ్ఞాన విజ్ఞానాలను శిష్యులకు బోధించాడు.

ఈ విధంగా గురు పరంపరకు ఆద్యుడుగా నిలి చాడు. ‘తత్త్వం గృహ్లాతీతి గురుః’ అని గురు శబ్దం వ్యుత్పత్తి. గురువు యొక్క శ్రేష్టత్వం గురించి స్కంద పురాణాంతర్గతమన ‘గురు ‘గీత’లో ఉల్లేఖించబడింది.
సాక్షాత్తు శివుడే ఉమా దేవికి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పినట్లు గురుగీత స్పష్టపరుస్తున్నది.
గురువు త్రిమూర్తుల స్వరూపం అంటూనే, ‘గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోపి తస్మై శ్రీ గురవే నమః” విశ్వానికీ, గురువుకూ భేదం లేదని గురుగీత చెబుతున్నది.
వర్ణాశ్రమ ధర్మాలు, ఆచారాలు, సత్యమార్గాన్ని ఇలా సత్క ర్మలన్నిటినీ ఒక్క గురువే బోధించగలడు.

మన సంస్కృతీ సంప్రదాయాలలో గురు శిష్య సంబంధం వెలకట్టలేనిది.
పరా – అపరా విద్యల జ్ఞాన ప్రదాత. ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు లౌకిక సంబంధమైన విషయా లను పంచమ వేదంగా చెప్పబడుతున్న మహాభార తంలో వ్యాసుడు చాలా విపులంగా చెప్పాడు.
దీనిని భారతీయ విజ్ఞాన సర్వ స్వంగా పేర్కొంటారు.
వ్యాసుడే మహాభారతాన్ని గురించి చెబుతూ -మానవ జీవితానికి సంబం ధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ఎక్కడ ఉండదు.

వ్యాసుడుతాను సముపార్జించిన సమస్త జ్ఞానాన్ని భవిష్యత్తులో మానవాళి అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్న ఆకాంక్షతో శిష్యులకు బోధించాడు.
గురువును శ్రద్ధగా సేవించి ఉన్నతి పొందినవా రిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏకలవ్యుడు, సత్య కామ జాబాలి, భక్తకన్నప్ప మొదలైనవారున్నారు.
గురువును కాదని తిరస్కరించినవారు పతనాన్ని చవిచూశారు.
మనలో ఆత్మజ్యోతి ఉద్దీపనం చేయాలంటే కేవలం సద్గురువు ద్వారానే సాధ్యం అవుతుంది.
ఆ సద్గురువులు ద్వారా పొందిన విద్య అసలైన విద్య, అందుకే గురు పరంపరలో మూలపురుషుడైన దేవుని గురుపూర్ణిమ రోజున తలచుకుంటున్నాం, పూజిస్తున్నాం.

అలా గురు వుని పూజిస్తే జ్ఞాన విజ్ఞాన సముపార్జనా రంగంలో విఘ్నాలుండవని సాక్షాత్ గణపతి ముఖస్థంగా వెలువడిన శ్లోకాన్ని వ్యాసారంభం లోనే ఉటంకించడం ముఖస్థంగా వెలువడిన శ్లోకాన్ని వ్యాసారంభంలోనే ఉటంకించడం జరి గింది, ఈ దివ్యమైన శ్లోకాన్ని వేద విభాగమైన నిరుక్తంలో లిఖించడం జరిగింది.
శ్రీ వ్యాస భగ వానుని అర్ధం చేసుకోవడానికి ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు.

*_🏵️శుభమస్తు🏵️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏