Live Update News..

*చంద్రబాబు ప్రజలను మోసం చేశారు: విడదల రజిని*

*ఆంధ్రప్రదేశ్ :*

సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.

బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసు అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. జగనన్న క్యాలెండర్ లో పండగలున్నట్టు నవరత్నాల పథకాలకు తేదీలు ప్రకటించి మరీ తొలి ఏడాదిలోనే 99% అమలు చేశారు.

రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని రజిని ధీమా వ్యక్తం చేశారు.

*ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి: చంద్రబాబు*

ఆంధ్రప్రదేశ్ :

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంట్లో నేరముసుగులో ఉన్న రాజకీయ నేతలపైనా చర్చ జరగాలని అన్నారు. 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు.

*భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లిస్తాం: సీఎం రేవంత్*

తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని AP సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ‘అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి నష్ట పరిహారం చెల్లిస్తాం.

తుమ్మిడిహెట్టి నుంచి వికారాబాద్, తాండూరు, చేవెళ్ల వరకు నీరు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాం’ అని చెప్పారు.

రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్.

రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. వచ్చే పదేళ్లు తానే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుంది. టి.కాంగ్రెస్‍ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

*భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి*

ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్ సహా పలు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి..

*బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరగనియ్యం…*

గోదావరి నదిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెబుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఒకవేళ మిగులు జలాలు ఉంటే… ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీకి తీసుకెళ్లే అవకాశం ఉందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఏపీ నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అరుణ చెప్పారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెలీ మీటర్లు కొత్తేం కాదని… వీటిపై గతంలో కూడా చర్చ జరిగిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు..

షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ బాద్‌షా.. ఆందోళనలో అభిమానులు.

వరుసగా పఠాన్, జవాన్, డంకి సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తన కూతురు సుహానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్..నేడు కింగ్ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి అని సమాచారం. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన చికిత్స కోసం షారుఖ్ అమెరికాకు వెళ్తున్నాడని సమాచారం. ఈ గాయాలతో షారుఖ్ నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు.