బెట్టింగ్ యాప్లపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం…!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బెట్టింగ్ యాప్లను నియంత్రించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. దీనిని బుధవారం లోక్సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ మోసాలు పెరుగుతుడడం, వీటికి ప్రచారం చేస్తున్న సెలెబ్రిటీలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై జరిమానా, నిబంధనలతో పాటు వీటికి ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనేలా రూల్చ్ తీసుకురానున్నారు. ముఖ్యంగా వీటిపై 40 శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది. 2023 అక్టోబర్లో బెట్టింగ్ యాప్స్పై 28శాతం జీఎస్టీ విధించారు. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వీటిపై 30శాతం పన్ను విధిస్తున్నారు. ఇంకా గుర్తింపు పొందని అక్రమ సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగించింది..

యాప్ప్‌కు బానిసలై కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా, మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌లను ప్రమోట్‌ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ యాప్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ నిఘా వ్యవస్థల కళ్లుగప్పి కొందరు వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ యాప్ప్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది..