నల్లగొండ జిల్లా:
రాష్ట్రంలో అడుగడుగున ఈ రేఖలు రైతులని అరిగోస పెడుతున్నాయి..
రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులకు యూరియా అండక ఇబ్బందులు పడుతున్నారు..
దామరచర్ల మండల కేంద్రంలో అద్దంకి, నార్కెట్పల్లి జాతీయ రహదారిపై యూరియా కోసం రోడ్డు ఎక్కిన మహిళా రైతులు యూరియా దొరక పొలానికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు…యూరియా కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టి ఉదయం నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు…యూరియా కోసం వచ్చిన రైతుల క్యూలో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పలుమార్లు కేంద్రాలకు రైతులు వచ్చి యూరియా అడుగుతున్నా లేదు అని చెప్పడంతో ఒకసారిగా రైతులు అగ్రహిస్తున్నారు..
సూర్యాపేట జిల్లా : (తుంగతుర్తి మండలం)
యూరియా కోసం రోడ్ ఎక్కిన మహిళా రైతులు..
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూరియా కొరతను వెంటనే తీర్చి ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో మహిళా రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేశారు..
సేకరణ..
షేక్. మహబూబ్ అలీ.