కామారెడ్డి వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్మోహన్ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు..వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్​ అండ్​ బీ బ్రిడ్జ్​ను సీఎం రేవంత్​ రెడ్డి పరిశీలించారు. బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన పోటో ఎగ్జిబిషన్​ను ముఖ్యమంత్రి సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. బ్రిడ్జ్​ కమ్​ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్​ చెక్​ డ్యామ్​ తరహాలో నిర్మించాలని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.వరదలకు మైనర్​, మేజర్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడికి వచ్చామని భరోసా కల్పించారు. శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మేటలు తొలగించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కామారెడ్డిలో వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తామన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించే సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయాలని తగు ఆదేశించారు. కామారెడ్డిలోని జీఆర్​ కాలనీకి చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డి, వరద బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. అంతకుముందు కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి బాధితుల్లో భరోసా నింపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఎర్రపహాడ్ వచ్చిన సీఎం, లింగంపల్లి మండలంలోని బురుగిద్దలో దెబ్బతిన్న పొలాలను చూశారు. లింగంపల్లి కుర్దులో వంతెన పరిశీలించారు.

“వందేళ్లలో ఎప్పుడూ కామారెడ్డిలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. ప్రభుత్వ సహకారమే కాదు, స్థానిక ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు మీకు కష్టం వచ్చిన్న అన్ని రోజులు మీతోనే ఉన్నారు. రాత్రిపగళ్లు మీతోనే గడిపారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా మీకు మనోధైర్యం ఇచ్చారు. మిమ్మల్ని కాపాడుకున్నారు. ఆయన కామారెడ్డిలోని పరిస్థితులను వివరించిన తర్వాత వెంటనే ఇక్కడకు రావాలని అనుకున్నాం. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల మెదక్​లోనే అధికారులతో సహాయక చర్యలపై ఆరా తీశాం. వరదలకు మైనర్​, మేజర్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి. మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడికి వచ్చాను. శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. వరదల్లో చనిపోయిన వారికి రూ.5 లక్షలు పరిహారం, పశుసంపద, పంటను కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తాం అన్నారు..