నేటి ప్రధాన వార్తలు…

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు
..
మనమంతా కలిసి ఈ శత్రువును జయించాలి..
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పట్నుంచో చెబుతున్నా..
విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మనం విఫలమవుతాం..ప్రపంచంలోనే భారత్‌ను బలమైనఆర్థికవ్యవస్థగా మార్చాలి..
ఇతరులతో కలిసినడుద్దాం కానీ..ఆత్మాభిమానంతో బతుకుదాం
140 కోట్లమంది భవిష్యత్‌ను ఇతర దేశాలపై వదిలేయం అన్నారు…

కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టిన తాటికొండ రాజయ్య.

కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి

ఎమ్మెల్యే సంతకం లేకుండా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమని తగలబెట్టిన తాటికొండ రాజయ్య..

ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కోసం ఎంపికైన సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర..

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం వంజరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై బైఠాయించిన సీఆర్ నగర్, మదన్ గూడా గ్రామాల మహిళలు

వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన…

రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడు..మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు నమోదు చేశాడు..

బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదు..

మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతాను.. అన్నారు.

యూరియా కోసం క్యూలో నిలబడి, తోపులాటలో మృతి చెందిన మహిళా రైతు..!

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఈ నెల 11న యూరియా కోసం క్యూలో నిలబడ్డ పాతులోత్ దసి(52)

ఈ క్రమంలో రైతుల మధ్య జరిగిన తోపులాటలో కిందపడి దసికి తీవ్ర గాయాలు

తోటి రైతులు ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళా రైతు దసి..!.

రూ.50 కోట్లు బ్లాక్ మనీ ఉంది వైట్ చేసి ఇస్తారా?

తెలంగాణలోని వ్యాపారులతో ఒక ఐఏఎస్ అధికారి మంతనాలు

అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీస్తున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న ఒక ఐఏఎస్ అధికారి ఫోన్ కాల్

పలువురు వ్యాపారులకు ఫోన్ చేసి “నా దగ్గర రూ.50 కోట్లు బ్లాక్ మనీ ఉంది, వైట్‌గా మారిస్తే రూ.1 కోటి ఇస్తా” అంటూ ఆఫర్లు ఇస్తున్న ఐఏఎస్ అధికారి

అత్యంత కీలక విభాగంలో పనిచేస్తున్న ఆయన, బాధ్యతలు స్వీకరించిన 4 నెలల్లోనే ఇంత డబ్బు వెనకేయడంపై అధికార వర్గాల్లో ఊపందుకున్న చర్చలు

ఇటీవల ఒక వ్యాపారికి అనుమతి ఇచ్చేందుకు రూ.3 కోట్లు తీసుకున్నట్టు, అనుమతులపై సొంత నిర్ణయాలు ఎక్కువైనట్లు సదరు ఐఏఎస్ అధికారిపై వరుస ఫిర్యాదులు

ఈ విషయం ఒక కీలక నాయకుడికి తెలియడంతో, అతని వద్ద ఉన్న బ్లాక్ మనీపై నివేదిక సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం

నివేదిక అందిన తర్వాత అతనిపై చర్యలు తప్పవని అధికార వర్గాలకు తెలిపిన సదరు కీలక నాయకుడు..!.

మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు-చంద్రబాబు.

నియంతలకు పట్టిన గతే ఇక్కడి వారికి పడుతుంది.ఆత్మకూరు రాకుండా నన్ను అడ్డుకున్నారు.పల్నాడులో రౌడీయిజాన్ని అణచివేస్తా..చెత్త రాజకీయాలను తొలగిస్తా అన్నారు..

భారత్ స్టార్‌లింక్ ధర, లాంచ్ తేదీ ఎప్పుడూ అంటే..!

భారత్‌‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది. రాబోయే నెలల్లో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌ లాంచ్ కానుంది. స్టార్‌లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్థ. ఇప్పటికే దేశంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు కోసం దాదాపు అన్ని అప్రూవల్స్ వచ్చాయి..అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే దేశంలో ఇంటర్నెట్ కార్యకలాపాలను స్టార్‌‌లింక్ ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇకపై ఇంటర్నెట్ సమస్య ఉండదు. అయితే, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసుకు సంబంధించి ధర, స్పీడ్, ప్లాన్లు వంటివి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.

భారత్ స్టార్‌లింక్ ధర, లాంచ్ తేదీ .

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ సింగిల్ సెటప్ ఖర్చు రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. నెలవారీ ప్లాన్‌లు రూ. 3,300 నుంచి ప్రారంభమవుతాయి. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు ధరలు అనేవి ప్రాంతాలను బట్టి మారవచ్చు…

మావోయిస్టు పార్టీల్లో విభేదాలు అంతర్గతం..
ప్రొఫెసర్‌ హరగోపాల్‌

శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా..
కేంద్రం అణచివేస్తూనే ఉంది..
2004లో కాంగ్రెస్ గెలవడానికి శాంతిచర్చలే కారణం..
ఎన్నికలపై మావోయిస్టులు ప్రభావం చూపగలిగితే..
పార్టీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది
శాంతి చర్చలకు తెలంగాణ సుముఖంగానే ఉంది..
రాహుల్, ఖర్గే కూడా పాజిటివ్‌గా ఉన్నారు
అందుకే రాహుల్‌పై అర్బన్‌ మావోయిస్టు ముద్రవేశారు..ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌లో..
ఇంకా మావోయిస్టులు ఉన్నారు..