*Hyderabad : కొత్త బోర్డు వచ్చేసింది*
ట్యాంక్‌బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సమావేశంలోనూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చారు….
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ బుధవారం (సెప్టెంబరు 24న) జరిగిన సమావేశంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చడానికి సంబంధించి ఒక ప్రతిపాదనను ఆమోదించింది. ఈ ప్రతిపాదనను సాధారణ అజెండా అంశాలలో భాగం కాకుండా జనరల్ బాడీ సమక్షంలో ఆమోదానికి పెట్టారు. కమిటీ ఆమోదించిన మరొక ప్రతిపాదన GHMC ఔట్సోర్సింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికుల జీతాల ఖాతాలను ప్రైవేట్ బ్యాంకు ఖాతాలు తెరవడం, వాటితో పాటు ప్రమాద బీమా, జీవిత భీమా లాభాలను అందించే నిర్ణయం తీసుకోవడంపై చర్చించారు..