తాజాగా గాజాపై ట్రంప్‌ ప్రణాళికను భారత్‌ స్వాగతించింది..!

ఇజ్రాయెల్‌- హమాస్‌ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. గాజాలో యుద్ధం (Gaza Plan) ముగింపుకు ట్రంప్‌ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. ట్రంప్‌ ప్లాన్‌ను పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. తాజాగా గాజాపై ట్రంప్‌ ప్రణాళికను భారత్‌ (India) కూడా స్వాగతించింది..

గాజాలో యుద్ధం ముగించేందుకు ట్రంప్‌ చేసిన ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ట్రంప్‌ ప్రణాళిక పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్‌ అవుతోంది.

ఇజ్రాయెల్‌- హమాస్‌ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాలో యుద్ధం (Gaza Plan) ముగింపుకు ట్రంప్‌ 20 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించారు. ట్రంప్‌ ప్లాన్‌కు ఇజ్రాయెల్‌ అంగీకారం తెలిపింది. సోమవారం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాకుండా.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు నెతన్యాహు ఈ సందర్భంగా తెలిపారు..