మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు..
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరీమాన…
మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ 26 కోట్ల అదనంగా వసూలు చేశారని ఆరోపణలు..
విచారణ అనంతరం ఉన్నత విద్యా కమిషన్ రూ 15 లక్షల జరిమానా..
విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ 26 కోట్లు 15 రోజుల్లో చెల్లించాలని విద్యా కమిషన్ ఆదేశాలు….
మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కొరడా జులిపించింది. ఏకంగా రూ.15 లక్షలు జరిమానా విధించింది. 2022-23 నుంచి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి రూ.26.17 కోటర్లు అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మొత్తాన్ని విద్యార్ధులకు 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న కమిషన్ ఆదేశాలు జారీ చేయగా.. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. అంతేకాకుండా వరుస అవకతవకలకు పాల్పడుతున్న వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ సిఫార్సు చేసింది…