ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..పాత రిజర్వేషన్ల రేషియో ఏంటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు….!

సుప్రీంకోర్టులో
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..

బీసీ రిజర్వేషన్స్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

పాత రిజర్వేషన్ల రేషియో ఏంటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు….

బీసీ -25
ఎస్సీ – 15
ఎస్టీ – 10
ఉన్నట్టు తెలిపిన ప్రతివాదుల న్యాయవాది…

ఆర్డినెన్స్ తో పాటు బిల్ రెండు నోటిఫై కాలేదు – ప్రతివాది న్యాయవాది..

50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అన్నది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే – సుప్రీమ్ కోర్టు

అభిషేక్ సింగ్వి
ప్రభుత్వ తరుపు న్యాయవాది

ట్రిపుల్ టెస్ట్ పాటించాము….

డోర్ టు డోర్ సర్వే నిర్వహించాం..

1 లక్ష మంది ఎన్యూమరేటర్లు సర్వే లో పాల్గొన్నారు..
——–
బిల్, ఆర్డినెన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఈ టైమ్ లో ఎందుకు GO ఇచ్చారు ? – సుప్రీమ్ కోర్టు..

50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడ లేదు.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కూడా ఎక్కడ చెప్పలేదని అన్నారు.

పాత రిజర్వేషన్ల రేషియో ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీసీ 25శాతం, ఎస్సీ 15శాతం, ఎస్టీ 10శాతం ఉన్నట్లు ప్రతివాదుల న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డినెన్స్ తో పాటు బిల్లు రెండు నోటిఫై కాలేదని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని.. మెరిట్స్ ప్రకారం విచారించాలని హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చునని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది…

*ఢిల్లీ*

*తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు*

తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.

తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ.

విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.

బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే ను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

*సుప్రీంకోర్టు వ్యాఖ్యలు*

ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ?

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు.

రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు.

అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి.

శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం.

డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాము.

గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.

ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు.

బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు.

రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది.

కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం.

బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము.

ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాము.

సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాము.

అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాము.

94,000 మంది డేటా సేకరించారు.

ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాము.

దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?

హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు.

వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

మాధవరెడ్డి తరఫున వాదనలు.

రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.

షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది.

జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు.

తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు.

కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది.

మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది.

50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.

ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు.