ఈ దీపావళి సీజన్లో బంగారం ధరలపై నిపుణులు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఈ మధ్య కొన్ని రోజుల్లో తగ్గినట్లు గమనించవచ్చు. శనివారం, MCXలో డిసెంబర్ బంగారం ఒప్పందం 2శాం పడిపోయి 10 గ్రాముల ధర రూ. 1,27,320కి చేరింది. అంతర్జాతీయంగా US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 2శాతం కంటే ఎక్కువ తగ్గి ఒక ఔన్సుకు $4,213.30 వద్ద నిలిచింది. దీని ప్రధాన కారణాలు US డాలర్ బలోపేతం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల తగ్గుదల, పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం అని చెప్పవచ్చు…
బంగారం మనకు ఆర్థిక భద్రతను ఇస్తుందని ఎన్నో దశాబ్దాలుగా నమ్ముతున్నాం. దాని ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షను దాటింది..ఇది పెట్టుబడిదారులు, సామాన్యులందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు అందరి చూపు 2026పై ఉంది. 2026లో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయి? అనే విషయంపై బాబా వాంగ ఆ కాలంలోనే జోస్యం చెప్పారు.
బాబా వాంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు వస్తాయని 50 ఏళ్ల క్రితమే చెప్పారు. వాటిని విశ్లేషించి చూస్తే బంగారం ధరలు వచ్చే ఏడాది మరింత పెరుగుతాయని కొంతమంది అంటున్నారు..
ప్రపంచంలో జరిగే కొన్ని కీలక అంశాలే బంగారం ధరలు పెరగడానికి కారణం. దేశాల మధ్య సమస్యలు, ధరలు పెరిగిపోవడం (ద్రవ్యోల్బణం), ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాలేదనే భయాలు ఉండడం వంటి అంశాలు ప్రజలు డబ్బును బంగారం వంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడిగా పెడతారు.
2026లో ఏం జరగబోతోంది?
బాబా వాంగ జోస్యాల ప్రకారం, ప్రపంచం ఒక “నగదు సంక్షోభం”లోకి వెళ్లవచ్చు. అంటే, బ్యాంకులు లేదా డబ్బు ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టేవారు బాగా లాభపడతారు.
గతంలో ప్రపంచంలో పెద్ద సంక్షోభాలు వచ్చినప్పుడు, బంగారం ధరలు 20% నుంచి 50% మధ్య పెరిగాయి. ఒకవేళ 2026లో అలాంటి సంక్షోభం వస్తే.. బంగారం ధరలు 25% నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే, 2026లో దీపావళి సమయానికి మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుంచి రూ.1,82,000 మధ్య ఉండవచ్చు. ఇది ఒక కొత్త రికార్డు అవుతుంది.
మనం ఏం చేయాలి?
కష్ట సమయాల్లో బంగారం ఆర్థిక రక్షణను ఇస్తుంది. మన భారతీయ సంస్కృతిలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.. కాబట్టి, రాబోయే సంవత్సరాల్లో ధరలు పెరిగితే, మనం బంగారం కొనే విధానం, బహుమతులు ఇచ్చే విధానం, డబ్బు దాచుకునే విధానం మారవచ్చు.
అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ అంచనాలు పాత జోస్యాలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా ఉన్నాయి. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు, కేవలం జోస్యాలపై కాకుండా, ఆర్థిక విషయాలు, ధరల పెరుగుదల సమాచారం, ప్రపంచంలో జరిగే ఇతర ముఖ్యమైన విషయాలను కూడా ఆలోచించాలి.
చివరగా…
ప్రపంచ ఆర్థిక పరిస్థితి మారినప్పుడల్లా, బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా నిరూపించుకుంది. 2026లో ఈ భారీ పెరుగుదల నిజమవుతుందో లేదో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. ఎన్ని కల్లోలాలు వచ్చినా, పసిడిపై మన ఆకర్షణ ఎప్పుడూ తగ్గదు…
బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో వచ్చే దీపావళి సీజన్కి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,500 నుంచి రూ. 1,82,000 మధ్య ఉండే అవకాశముందని గ్రోక్ పేర్కొన్నారు. ఈ అంచనా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బంగారం పై పెరిగిన డిమాండ్ ఆధారంగా సిద్ధమైంది. పెట్టుబడిదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని, దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..