హోటల్ లో దోశలు వేసిన మంత్రులు..!

హోటల్ లో దోశలు వేసిన మంత్రులు..

కూరగాయల షాపుకు వెళ్లిన అనంతరం మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ యూసఫ్ గూడ డివిజన్ లోని ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ మంత్రులు దోశ వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు..

ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీ బిజీ.. ఎలాగైనా గెలిసి తీరాలని పార్టీల కీలక నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లి గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు యూసుఫ్ గూడ డివిజన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతా ముదిరాజ్ లు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా యూసుఫ్ గూడలో కూరగాయల షాపు ఓనర్ తో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కాసేపు ముచ్చటించారు. గత రెండేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం స్కీం గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు అందరూ తమవైపే ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు…