TG: దివంగత నేత నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) విగ్రహాన్ని అమీర్‌పేటలోని మైత్రీవనం కూడలిలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. “ఎన్టీఆర్ అందరికీ ఆదర్శనీయులు, రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గౌరవించుకోవాలి” అని వ్యాఖ్యానించారు…..
3 గంటలు మహిళలను ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు.
మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు టీడీపీకి 216 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. మిగతా సీట్లు టీడీపీ మిత్రపక్షాలకు వచ్చాయి. ఆ సమయంలో శాసనసభలో పీజేఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తి 2007లో గుండె ఆగి చనిపోతే అప్పుడు చంద్రబాబునాయుడు.. ఏకగ్రీవం చేద్దాం.. టీడీపీ తరఫున పోటీకి ఎవరినీ నిలబెట్టమని చెప్పారు. అయితే కేసీఆర్ మాత్రం కావాలని అభ్యర్థిని నిలబెట్టి అప్పటి వరకు ఉన్న మంచి సంప్రదాయాన్ని చెడగొట్టి దుష్ట సంప్రదాయానికి నాంది పలికాడు..
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ దే.
ఆ సమయంలో పీజేఆర్ భార్య, పిల్లలు… చంద్రబాబు మాకు అండగా నిలబడ్డాడు.. ఎన్నికను ఏకగ్రీవం చేద్దాం.. మీరు కూడా సహకరించండని అడగడానికి కేసీఆర్ ఇంటికి వెళితే.. మహిళలని కూడా చూడకుండా గేటు బయట ఎండలో మూడు గంటలు నిలబెట్టిన కనికరం లేని కసాయి అని, కావాలంటే ఇక్కడే ఉన్న పీజేఆర్ కూతురు విజయారెడ్డిని అడగండంటూ ప్రజలకు రేవంత్ ఆమెను చూపించారు..