వనస్థలిపురం లోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు హాల్ చల్…!
వనస్థలిపురం లోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు దుండగులు గోడ దూకి విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించిన తీరు..
భయబ్రాంతులకు గురవుతున్న కాలేజీ హాస్టల్ ఉన్న దాదాపు 50మంది విద్యార్థిని లు
రాచకొండ పోలీస్ కమిషనర్ కి అదే రాత్రి ఆన్లైన్ ఫిర్యాదు చేసిన కాలేజీ ప్రిన్సిపాల్
ఇప్పటివరకు చర్యలు శూన్యం.. పట్టించుకొని పోలీసులు ఆరోపిస్తున్న కాలేజీ యాజమాన్యం…
విద్యార్థినుల గదుల డోర్లను కొట్టారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థినులు ‘‘ఎవరు మీరు? ఎందుకు వచ్చారు’’? అని ప్రశ్నించగా.. చెప్పలేని భాషలో మాట్లాడారని, అసభ్యంగా ప్రవర్తించారని విలపించారు. వెంటనే 100 నంబర్‌కు డయల్ చేయగా.. పోలీసులు వచ్చి తాగిన మత్తులో ఉన్నవారిని అక్కడి నుంచి పంపించి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై ఆరోపణలు..
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి శిక్షించకుండా.. వారిని మందలించి పంపించివేసిన పోలీసుల తీరుపై హాస్టల్ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మా భవిష్యత్ అంధకారమయ్యేదని విద్యార్థినులు కన్నీటిపర్వంతమయ్యారు. నిందితులను పట్టుకుని కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఆకతాయిలను వదిలేయడం తమకు బాధ కలిగించిందని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ రాణి డిమాండ్ చేశారు.
రాచకొండ సీపీకి ఫిర్యాదు..
కాగా ఈ తతంగం అంతా హాస్టల్ సీసీ కెమెరాలలో రికార్డింగ్ అయింది. సదరు రికార్డింగ్ క్లిప్స్‌తో శుక్రవారం రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబుకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. ఇప్పటికైనా వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆన్లైన్లో కోరారు.