బక్కమంతుల గూడెం గ్రామంలో హై టెన్షన్ వాతావరణం..!

*సూర్యాపేట జిల్లా….*

మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది….

గ్రామంలో రేపు జరగనున్న మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఇరిగెల నరేందర్ రెడ్డి వార్డ్ సభ్యులు కృష్ణపాటి నవీన్ రెడ్డి,పల్లె నరసింహా రెడ్డి, పారెడ్డి సైదిరెడ్డి, బల్మూరి వీరారెడ్డి,మాదారపు గోపీ లను రాత్రి 10 గంటల సమయంలో ఏ కారణం లేకుండా పోలీసు వారు గ్రామంలో దారిలో కాపు కాసి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారని అనంతరం వారిని మఠంపల్లి స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ కూడా విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు…

వారి సెల్ ఫోన్లు లాక్కొని ఉదయం వదలి పెట్టారని కారణం లేకుండా ఇలా పోలీసులు దాడి చేసి కొట్టడం తో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రతి సారి గ్రామంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరుగుతాయని ఈసారి ఇలా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కొట్టడంలో ఆంతర్యం ఏమిటో అనేది అర్ధం చేసుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న అధికార పార్టీ కి చెందిన వారి ప్రోద్బలంతోనే ఇలా జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపద్యంలో
గ్రామంలో 144 సెక్షన్ విధించారు ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పహరా ఉండటంతో వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు….

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి brs పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడగా…. అతనిని బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి బరిలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని వర్గ పోరు నడుస్తుండగా… దీంతో కాంగ్రెస్ లోనే రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేయడం జరుగుతుంది..

పోలీసులు మాత్రం ఒక వర్గానికి మద్దతు తెలుపుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు..