వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీసేందుకు రెడీ అయిపోయింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ అన్ని ఏర్పాటు చేసేసింది…తాజాగా బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో రైలు లోపల ఎలా ఉందో వీడియోలో చూపించారు. ఆ విజువల్స్ చూస్తుంటే ఓ లగ్జరీ విమానం ఇంటీరియర్కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది.
రైలు ప్రయాణాలు ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా, వేగంగా, ప్రీమియంగా మారనున్నాయి. త్వరలో దేశంలో మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ పాట్నా-న్యూఢిల్లీ ట్రాక్ పరుగులు తీయనుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వీడియోలో ఆధునిక, హైటెక్ ఇంటీరియర్లను చూపించారు. ఈ రైళ్లలో వై-ఫై, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లు, సిసిటివి-మానిటరింగ్ కోచ్లు ఉంటాయి, ఇవి ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. స్లీపర్ వందే భారత్ గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది, సాంప్రదాయ రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది..