వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్..

వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం

భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్

భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త

యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు

రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోత్స్న.

తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జ్యోత్స్న.

విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్..

వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు..

తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తన ఆస్తులను కూడా ఆక్రమించుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, చౌరస్తాలో ఉన్న తన భర్త బంగారు గొడవ దుకాణం వద్దకు చేరుకుని కత్తితో హంగామా,తన భార్య కత్తితో మీదకు రావడంతో భయపడిన శ్రీకాంత్, ప్రాణాలు దక్కించుకోవడానికి పక్కనే ఉన్న ఒక షాపులోకి వెళ్లి దాక్కున్నాడు. జ్యోత్స్న కత్తితో రోడ్డుపై తిరుగుతున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వారించి, చాకచక్యంగా ఆమె చేతిలో కత్తిని లాక్కున్నారు.

మరోవైపు, తన భార్యకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తాను విడాకుల కోసం కోర్టులో కేసు వేశానని శ్రీకాంత్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగానే ఈ గొడవ జరిగింది. పోలీసులు జ్యోత్స్నను, ఆమె మామను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాతకీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959