ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్‌లోని సచ్ ఖండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురుగోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. మహారాష్ట్రలోని సిక్కుల 5 అత్యున్నత పీఠాల్లో ఒకటైనా గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో ఆయన పాల్గొన్నారు.
గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన పవన్ కల్యాణ్‌కు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఘప స్వాగతం పలికారు. అనంతరం గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్‌కు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. ప్రధాన మందిరంలో గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు.