తృటిలో భారీ ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పైకి ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కాన్వాయ్‌తో కలిసి మంచిర్యాలలోని బస్టాండ్ రోడ్డు గుండ వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి ఎమ్మెల్యే కారు వైపు దూసుకొచ్చింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు మళ్లించడంతో పెను ముప్పు తప్పింది.
ప్రమాదం తప్పిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కారు దిగి బస్సు డ్రైవర్ జక్కుల మల్లేశ్‌ను నిలదీశారు. అదుపు తప్పడానికి గల కారణాలను అడుగుతుండగా, డ్రైవర్ నుంచి తీవ్రమైన మద్యం వాసన రావడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మద్యం సేవించి బస్సు నడపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బస్సు డ్రైవర్‌కు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ పరీక్షలో 105 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు నిర్ధారించారు. పరిమితికి మించి మద్యం సేవించి బస్సు నడిపినట్లు తేలడంతో డ్రైవర్ మల్లేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
“ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ డ్రైవర్ బాధ్యత ఇలారాహిత్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ఆందోళనకరం.” – ఎమ్మెల్యే శ్రీగణేష్
మంచిర్యాల బస్ స్టాప్ దగ్గర ఆ కాన్వాయ్ మీదకు ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎమ్మెల్యే కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసి హుటాహుటిన స్పాట్ వచ్చిన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు,,,. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. నల్లగొండ మండలం చర్లపల్లిలో జరిగిన కారు ప్రమాదంలో లాస్య నందిత మృతిచెందారు. ఆమె మరణానంతరం కంటోన్మెంట్లో జరిగిన ఉపఎన్నికలో శ్రీగణేశ్ విజయం సాధించారు.