ఉమ్మడి నల్గొండ కు ఇద్దరు మంత్రుల ఉన్న శుద్ధ దండగ.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

నల్గొండ జిల్లా……
దేవరకొండ లో మాజీ మంత్రి, mla జగదీష్ రెడ్డి సమక్షంలో,కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య తో పాటు 400 కార్యకర్తలు BRS లో చేరిక…..ఈ సందర్భంగా..

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ……రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది.. కేవలం పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తోంది.. అది కుడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పని చేస్తున్నది…. జిల్లాలో ఇద్దరు మంత్రుల ఉన్న శుద్ధ దండగ.. సాగర్ కింద, slbc కింద నీళ్లు ఇవ్వలేని చావ లేని ,సత్తా లేని మంత్రులు వీల్లు.. డిండి పాలమూరు రంగరెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా నల్గొండ కి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతోంది.. అయిన ఈ ఇద్దరు మంత్రులు చేతకాని వారిలాగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు..వీల్ల భరతం పడతామ్.. విల్ల చేతకాని తనాన్ని నిలదీస్తాం..జిల్లాలో మంత్రులు హెలికాఫ్టర్లలో తిరగడం తప్ప అభివృధి చేసింది ఎం లేదు..రైతు బంధును మూడు సార్లు ఎగ్గొట్టిన మోసగాడు ఈ సీఎం రేవంత్ ….నీళ్లు ఇవ్వకుండా, యూరియా లేక కరంట్ ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..రాహుల్ గాంధీకి, కేరళ ఎన్నికలకు మాత్రం వందల కోట్లు తెలంగాణ సొమ్మును తరలిస్తున్నారు..కాంగ్రెస్ అధిష్టానం కి తెలంగాణా atm లా మారింది. .కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు ఓ స్వర్ణయుగం..ఏ విషయం లో కూడా అన్నదాతలు ఇబ్బందులు పడలేదు.. కాంగ్రెస్ వచ్చింది వ్యవసాయం అస్తవ్యస్తంగా మారింది..ఆగం అయింది.. జగదీష్ రెడ్డి..