భారత్ మయూరి నారీ నౌకపై ఇరాన్ దాడి… మా అనుమతి లేకపోతే ఎవ్వరికైనా ఇదే గతి అంటు హెచ్చరికలు…!

హర్మూజ్‌ జలసంధి దగ్గర యుద్దం మరింత ముదిరింది. ఇవాళ ఒక్క రోజే మూడు చమురు నౌకలను ఇరాన్‌ పేల్చేసింది. రెండు అమెరికా నౌకలు , ఓ బ్రిటన్‌ నౌకను పేల్చేశారు. తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన మయూరీ నారీ నౌకను క్ఊడా పేల్చేశారు. దీంతో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. 20మందిని సహాయక సిబ్బంది కాపాడారు. దుబాయ్‌ నుంచి గుజరాత్‌ లోని ఖాండ్లా పోర్ట్‌కు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు…..

అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అటుగా వస్తున్న మూడు నౌకలను పేల్చిసి ఇరాన్ అన్నంత పని చేసింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా ఓడరేవు నుంచి గుజరాత్‌లో ఖాండ్లా పోర్ట్‌కు వస్తున్న థాయ్ నౌకపై దాడి చేసి పేల్చేసింది. ఈ నౌకపై తామే దాడి చేసినట్టు ఓ ప్రకటన ద్వారా లేర్కొంది…అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా ఓడరేవు నుండి బయలుదేరిన ఈ థాయ్ నౌక హార్ముజ్ జలసంధికి వద్దకు చేరుకోగానే ఇరాన్ సైన్యం ఈ నౌకపై దాడి చేసింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం సముద్రంలో పడిపోయారు. అయితే వీరిలో ఒమానీ నావికాదళం 20 మంది సిబ్బందిని రక్షించగా మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ లభించలేదు. ఆ ముగ్గురు సిబ్బందిని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు…ఈ ఘటనపై స్పందిస్తూ థాయ్ నేవీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ థాయ్ నేవీ షేర్ చేసిన ఫోటోలు థాయ్-రిజిస్టర్డ్ మయూరీ నౌక నుంచి భారీ నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు, లైఫ్ తెప్పలు నీటిలో తేలుతున్నట్లు కనిపించాయి. అయితే ఈ షిప్ హార్ముజ్ జలసంధిలో ఒమానీ తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు షిప్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు తెలిపాయి. థాయ్ రవాణా సంస్థ ప్రెషియస్ షిప్పింగ్ యాజమాన్యానికి చెందిన ఈ నౌక భారత్‌లోని కాండ్లా పోర్టుకు వెళ్తోందని.. ఈ నౌక 178 మీటర్ల పొడవు, 30,000 టన్నుల బరువును మోసుకెళ్లగలదని తెలుస్తోంది…

హార్ముజ్ జలసంధిలో థాయ్ షిప్పింగ్ నౌక “మయూరి నారి”పై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది.

హార్ముజ్ జలసంధిలో థాయ్ షిప్పింగ్ నౌక “మయూరి నారి”పై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఈ నౌక మార్చి 11, 2026న భారతదేశంలోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుండగా, దానిని లక్ష్యంగా చేసుకున్నారు. పశ్చిమాసియాలో వివాదంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారతదేశం పేర్కొంది…
విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల ప్రాణనష్టం క్రమంగా పెరుగుతోంది. ఇది అమాయక పౌరులు, భారతీయ సిబ్బంది ప్రాణాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. నావిగేషన్ స్వేచ్ఛను గౌరవించాలని, పౌర నౌకలను సైనిక దాడి నుండి దూరంగా ఉంచాలని భారతదేశం అంతర్జాతీయ వేదికపై పునరుద్ఘాటించింది..