పసిడి ధరలు మరింత పతనం కావొచ్చనే అంచనలు..!

బంగారం ప్రియులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసిడి ధరలు మరింత పతనం కావొచ్చనే అంచనలు గట్టిగానే నెలకొన్నాయి. ఇంతకీ గోల్డ్ రేట్లు ఎంత వరకు పడిపోవచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు?..ఖలీజ్‌టైమ్స్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక ఘర్షణల వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో రాబోయే వారాల్లో బంగారం ధరలపై మరింత ఒత్తిడి పెరిగి, గోల్డ్ రేట్లు సుమారు 10 శాతం మేర తగ్గి 3,800 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు జనవరి నెల గరిష్ట ధరలతో పోలిస్తే దాదాపు 20 శాతం పడిపోయింది…అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను “ఎక్కువ కాలం పాటు అధికంగానే” ఉంచేలా చేస్తోంది. దీనికి తోడు గోల్డ్ ఈటీఎఫ్ (ETF)ల నుండి సుమారు 7.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు బయటకు వెళ్లడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది..బంగారం ధర 4,800 డాలర్లకు చేరుతుందా లేక 3,800 డాలర్లకు పడిపోతుందా? ఎక్స్‌ఎస్.కామ్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ రానియా గులే మాట్లాడుతూ.. ప్రస్తుతం పసిడి మార్కెట్ ఒక కీలక దశలో ఉందని తెలిపారు. మార్కెట్‌లో అనిశ్చితి ఎక్కువగా ఉండటం వల్ల ధరలు భారీగా పెరుగుతాయా లేదా భారీగా తగ్గుతాయాలేదా భారీగా తగ్గుతాయా అనే విషయంలో ఇన్వెస్టర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..

ఈటోరో మార్కెట్ అనలిస్ట్ జాకుబ్ రోచ్లిట్జ్ అభిప్రాయం ప్రకారం.. బంగారం ప్రస్తుతం రెండు వ్యతిరేక శక్తుల మధ్య చిక్కుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు బంగారానికి డిమాండ్‌ను పెంచుతుంటే, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వచ్చే ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలను పెంచుతోంది. ఇది బంగారంపై భారాన్ని పెంచుతోంది. గతేడాది వచ్చిన భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాలను స్వీకరిస్తూ తమ పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు. దీనివల్ల స్వల్పకాలంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది