హుజూర్ నగర్ పట్టణంలో దారుణం ఘటన….!

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్ నగర్ పట్టణంలో దారుణం ఘటన….

నిర్లక్ష్యంగా వేడి బూడిదని బస్తాలలో ప్యాక్ చేసి రోడ్ పక్కన పడవేసిన మిల్లర్లు !.

… ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు బాలురులకు తీవ్ర గాయాలయ్యాయి..

నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే అత్యంత వేడి ఉన్న బూడిదని బస్తాల్లో ప్యాక్ చేసి అక్కడ వేయడంతో తెలవక ఆడుకుంటూ వెళ్లి అందులో పడిన విశాల్ అనే ఓ బాలుడు.. రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు మిత్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి..
ఆడుకుంటూ వెళ్లిన
విశాల్..(10). తీవ్ర గాయాలు..
నాగ యశ్వంత్..(11).. కాళ్లు రెండు పూర్తిగా కలడం
యశ్వంత్..(13).. గాయాలు.. విశాల్ ని ఖమ్మం తరలింపు,, అక్కడి నుండి హైదరాబాదుకి తరలించినట్లుగా తెలుస్తోంది… విశాల్ కి తొడల వరకు, నాగ యశ్వంత్ కు, కూడా పూర్తిస్థాయిలో కాలిపోవడంతో ఆర్తనాదాలు చేస్తూ అందరి హృదయాల్ని కదిలించి వేసింది.. ……

మొదటగా విశాల్ వేడి బూడిదలో కూరుకపోగా విశాల్ ని కాపాడేందుకు మిగతా ఇద్దరు మిత్రులు కూడా ప్రయత్నం చేయగా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి…

విశాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా అక్కడి నుండి నుండి హైదరాబాద్ తరలింపు చేసినట్లుగా కుటుంబీకులు తెలిపారు…

ఇంత నిర్లక్ష్యంగా వేడి బూడిదని రోడ్డు పక్కనే పెట్టడం దీంట్లో పిల్లలు పడడంతో తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

కాలిన గాయాలతో పరిస్థితులు చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా వినిపించారు… రోడ్డు పక్కన ఇలాంటి వేడి బూడిద వేసిన మిల్లర్ల, అయిన లేక మరెవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..